/rtv/media/media_files/2025/11/02/finals-2025-11-02-07-51-05.jpg)
వరల్డ్ కప్ అంటేనే క్రేజ్. అది అమ్మాయిలు ఆడినా, అబ్బాయిలు ఆడినా. అయితే వుమెన్స్ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ ను సొంతం చేసుకోలేదు. రెండు సార్లు చివరి వరకు వచ్చి పోయింది. ఇది మూడోసారి అమ్మాయిల జట్టు ఫైనల్స్ లోకి అడుగుపెట్టడం. దీంతో ఈ సారైనా కప్పు దక్కుతుందా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందులోనూ ఈ సారి విమెన్ క్రికెట్ టీమ్ సెమీ ఫైనల్స్ లో అద్భుతం చేసింది. ఢిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. ఇప్పటివరకు మహిళల వన్డే ప్రపంచ కప్ 12 సార్లు జరగ్గా.. ఆస్ట్రేలియా ఏడుసార్లు, ఇంగ్లాండ్ నాలుగుసార్లు, న్యూజిలాండ్ ఒకసారి విజేతగా నిలిచాయి. ఈ సారి ఆ జట్లేవీ ఫైనల్‌కు రాలేదు. దీంతో భారత జట్టుకు కప్పు గెలవడానికి మరిన్ని అవకాశాలున్నాయి. 2005, 2017లో విశ్వవిజేతగా నిలిచే అవకాశాన్ని మిస్ చేసుకున్న భారత్ ..మూడోసారి ఎలాగైనా టైటిల్‌ను ఎగరేసుపోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా కూడా కప్పు గెలవాలని ఎదురు చూస్తోంది.
టీమ్ ఇండియాకే ఛాన్సెస్ ఎక్కువ..
అయితే సఫారీలకు, భారత్ జట్టుకు చాలా తేడా ఉంది. సౌత్ ఆఫ్రికా కన్నా టీమ్ ఇండియా బలంగా ఉంది. సఫారీల బలహీనత స్పిన్. ఆ జట్టు దీన్ని ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతోంది. లీగ్ దశలో ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి సెమీస్‌కు వచ్చిన సఫారీలు.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం చవిచూశారు. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణం స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొకోకపోవడమే. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 69 పరుగులకు, ఆస్ట్రేలియాపై 97 రన్స్‌కే దక్షిణాఫ్రికా కుప్పకూలింది. ఇప్పుడే ఇదే భారత జట్టుకు బలంగా మారనుంది. మన టీమ్ లో మంచి స్పిన్నర్ దీప్తిశర్మ ఉంది. ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో ఆమె 17 వికెట్లు పడగొట్టింది. ఫైనల్ లో కూడా దీప్తి ఇదే విధంగా బౌలింగ్ చేస్తే సఫారీలను కట్టడి చేసినట్టే. అలాగే స్నేహ్ రాణా, రాధా యాదవ్ లు కూడా అందుబాటులోనే ఉన్నారు.
ఇవన్నీ ఒక ఎత్తైతే భారత జట్టులో బ్యాటింగ్ బలం మెండుగా ఉంది. ఓపెనర్లు స్మృతి మంథాన , సెమీ ఫైనల్స్ లో అదరగొట్టిన జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ లు నిలకడగా ఆడుతున్నారు. వీరు ఫైనల్ లో మరోసారి అద్భుతాలను చేస్తారని భావిస్తున్నారు. భారత జట్టు సమిష్టిగా ఆడితే గెలుపు ఖాయమని అంటున్నారు.
Also Read: JD Vance: జేడీ వాన్స్, ఉషా చిలుకూరితో విడాకులు? వెంటనే ఎరికా కిర్క్ తో పెళ్ళి?
Follow Us