Mohammad Kaif: టెస్టు కెప్టెన్‌గా బుమ్రా వద్దు.. వారైతేనే కరెక్ట్: మహ్మద్ కైఫ్‌

టెస్టుల్లో టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా ఉండటం సరైన ఆలోచన కాదని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నారు. కెప్టెన్సీ అనేది అతడిపై ఒత్తిడికి దారితీస్తుందన్నారు. పంత్ లేదా కేఎల్ రాహుల్ సారథి అవ్వాలనుకుంటున్నానని తెలిపారు.

New Update
ex Indian cricketer Mohammad Kaif about bumrah captain

ex Indian cricketer Mohammad Kaif about bumrah captaincy

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టుల మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేసి అందరిచేత విమర్శలకు గురయ్యాడు. గ్రౌండ్‌లోకి దిగడం 10 లేదా 20 బాల్స్ ఆడటం.. రెండు మూడు పరుగులు చేసి ఔటవ్వడం ఇదే జరిగింది. దీంతో అతడి ఆటతీరుపై తీవ్ర విమర్శలు, ట్రోలింగ్స్ వచ్చాయి. 1-3 తేడాతో ఈ సిరీస్‌ను కోల్పోవడంతో రోహిత్‌పై టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. 

దీంతో రోహిత్ శర్మ టెస్టుల్లోంచి తప్పుకోవాలని.. వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాలని నెట్టింట వార్తలు సాగాయి. ఈ తరుణంలోనే రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్‌గా బుమ్రాని నియమించాలని కొంతమంది మాజీ దిగ్గజ క్రికెటర్‌లు సూచిస్తున్నారు. పెర్త్‌ టెస్టులో టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా సారథ్యం వహించి జట్టుకు విజయం అందించాడు. దీంతో టెస్టుల్లో బుమ్రానే పూర్తి స్థాయి కెప్టెన్‌గా చేయాలని కొందరు చెబుతున్నారు. 

Also Read: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి అలర్ట్.. పోలీసుల కీలక సూచనలు!

కెప్టెన్‌గా బుమ్రా వద్దు

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెస్టు మ్యాచ్‌లలో బుమ్రాను కెప్టెన్‌గా వద్దని అన్నారు. కెప్టెన్సీ అనేది అతడిపై ఒత్తిడికి దారితీస్తుందని పేర్కొన్నారు. రోహిత్ శర్మ తర్వాత బుమ్రాను కెప్టెన్‌గా నియమించడం సరైన ఆలోచన కాదని అన్నారు. టీం కోసం తన జీవితాన్ని దారబోసిన ఏకైక బైలర్ బుమ్రా అని అన్నారు. జట్టులో ఏ బౌలర్ నుంచి తను సహకారం లేకున్నా.. ఎంతో ఒత్తిడిని బుమ్రా ఎదుర్కుంటాడని తెలిపారు. 

Also read: బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. 27మందిపై కేసు, పోలీసుల అదుపులో వ్యాపార వేత్త

ఇక సిడ్నీ టెస్టులో అతడు గాయపడటానికి కూడా సరైన రీజన్ అదేనని చెప్పుకొచ్చారు. అందువల్ల బుమ్రా కెప్టెన్ కాకూడదని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. బుమ్రా కాకుండా అతడి స్థానంలో రిషబ్ పంత్ అయినా, కేఎల్ రాహుల్ అయినా భారత్ జట్టుకు కెప్టెన్ అవ్వాలని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. వీరిద్దరిలో ఎవరినో ఒకరిని కెప్టెన్‌గా సెలెక్ట్ చేస్తే బాగుంటుందని కైఫ్ పేర్కొన్నారు. 

Also Read: తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్.. మందుబాబులకు బిగ్ షాక్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు