/rtv/media/media_files/2025/01/24/R0l1M48yVZyFUvfNXxBk.jpg)
Medchal Young Woman Murder
జనవరి 24న మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని ఓ కల్వర్టు కింద ఓ మహిళను దారుణంగా చంపి పడేశారు. అంతకు ముందు ఆమెను రేప్ చేశారని అన్నారు. మృతురాలిని గుర్తుపట్టకుండా ముఖం చిధ్రం చేసి...ఆ తరువాత పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. దీంతో అందరూ దీన్ని దిశ తరహా మర్డర్ అనుకున్నారు. పోలీసులు కూడా మృతురాలిని గుర్తుపట్టడానికి, నిందితుడిని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు. అయితే సింపుల్ గా ఒక కండోమ్ నిందితుడిని పట్టిచ్చేసింది. మేడ్చల్ యువతి మహిళ కేసులో సంచలన విషయాలను తెలిపారు పోలీసులు.
నిందితుడిని పట్టిచ్చిన కండోమ్..
కల్వర్టర్ కింద చనిపోయిన మహిళది నిజామాబాద్ జిల్లా బోధన్ దగ్గరలోని సెట్టిపేట్. ఆమెకు 45 ఏళ్ళు. తన భర్తతో గొడవపడి హైదరాబాద్ కు వచ్చేసింది. కుషాయిగూడలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవన కొనసాగించింది. ఈ మహిళ జనవరి 24వ తేదీన పని కోసం మేడ్చల్ బస్టాండ్ దగ్గరికి వచ్చింది. అదే సమయంలో.. శామీర్‌పేట మజీద్‌పూర్‌కు చెందిన షేక్ ఇమామ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆమెతో మాలు కలిపాడు. తనతో గడిపితే 500 రూ. లు ఇస్తానని చెప్పాడు. అందుకు ఆ మహిళ కూడా ఒప్పుకుంది. దీంతో ఇద్దరూ కలిసి కల్వర్డర్ కిందకు వచ్చారు.
అక్కడి వెళ్ళిన తర్వాత అసలు మ్యాటర్ అంతా జరిగింది. పనయ్యాక మహిళ ఎక్కువ డబ్బులు అడిగింది. దీంతో ఇమామ్ కు కోపం వచ్చింది. దీంతో ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇమామ్...మహిళ గొంతు నులిమి, బండరాయితో మోది చంపాడు. అక్కడితో ఆగకుండా అదే రాయితో ఆమె మొహాన్ని పచ్చడి చేశాడు. తరువాత పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు.
స్థానికులు సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఆమె ఒంటిపై నగలను బట్టి కొత్తగా పెళ్ళయింది అనుకున్నారు. చేతి మీద పేర్లను చూసి...ప్రేమించి అబ్బాయిలు అనుకున్నారు. కానీ తరువాత ఆమె ఫోన్ నంబర్ దొరకడంతో....తీగ లాగితే డొంక అంతా కదిలింది. ఆమె ఎవరు, హత్యకు ముందు ఎక్కడున్నదీ అంతా ఆరా తీశారు పోలీసులు. అందులోనే ఉన్న ఒక డిజిటల్ పేమెంట్ ను బట్టి మొత్తం వివరాలు తెలుసుకున్నారు. కండోమ్ కొనడానికి వినియోగించిన ఆ డిజిటల్ పేమెంట్ సహాయంతో నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. అలా మొత్తానికి ఒక కండోమ్ కేసును సాల్వ్ చేయడమే కాకుండా..నిందితుడిని పట్టిచ్చింది.
OTT Movies: మూవీ లవర్స్ కి పండగ.. ఈ వారం ఓటీటీలో బోలెడు సినిమాలు.. లిస్ట్ ఇదే!