ENG vs NZ : న్యూజిలాండ్‌తో సూపర్-8 మ్యాచ్‌.. ఇంగ్లాండ్‌ టార్గెట్ ఎంతంటే ?

టీ20 ప్రపంచ కప్ సూపర్-8 దశలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు ఆరంభం బాగుంది.

New Update
eng vs nz

టీ20 ప్రపంచ కప్ సూపర్-8(T20 World Cup 2026 Super-8) దశలో భాగంగా ఇంగ్లాండ్‌(england) తో జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్(new-zealand) బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు ఆరంభం బాగున్నప్పటికీ, మధ్య ఓవర్లలో ఇంగ్లాండ్ స్పిన్నర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసిన న్యూజిలాండ్, ప్రత్యర్థికి 160 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది. 

జట్టులో గ్లెన్ ఫిలిప్స్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, టిమ్ సీఫెర్ట్ (35), ఫిన్ అలెన్ (29) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు రచిన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్ విఫలం కావడంతో స్కోరు నెమ్మదించింది.ఇంగ్లాండ్ బౌలర్లలో స్పిన్నర్లు అద్భుతంగా రాణించి న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు. అదిల్ రషీద్, రెహాన్ అహ్మద్, విల్ జాక్స్ తలో రెండు వికెట్లు తీసి కివీస్‌ను కట్టడి చేయగా, లియామ్ డాసన్ ఒక వికెట్ సాధించాడు. - ENG vs NZ

Also Read :  IND vs ZIM: జింబాబ్వేతో మ్యాచ్‌.. భారత్ రికార్డు స్కోర్!

సెమీఫైనల్ రేసులో అత్యంత కీలకం

ఈ మ్యాచ్ ఫలితం సెమీఫైనల్ రేసులో అత్యంత కీలకంగా మారింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది, తద్వారా పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అయితే, కివీస్ ఓడిపోతే మాత్రం పాకిస్థాన్‌కు ఆశలు సజీవంగా ఉంటాయి. ఫిబ్రవరి 28న శ్రీలంకతో జరిగే ఆఖరి పోరులో పాక్ భారీ నెట్ రన్ రేట్‌తో విజయం సాధిస్తే సెమీస్ చేరే అవకాశం ఉంటుంది.

Also Read :  రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్! .. ఫోటోలు వైరల్!

Advertisment
తాజా కథనాలు