/rtv/media/media_files/2025/08/04/eng-vs-ind-2025-08-04-16-31-46.jpg)
ENG vs IND
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. లండన్‌లోని ఓవల్ వేదికగా జరిగిన ఈ ఐదో టెస్టులో టీమిండియా 6 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని పొందింది. టీమిండియా గెలుపులో పేసర్ మహమ్మద్ సిరాజ్ సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టిన సిరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఉత్కంఠగా సాగిన ఈ ఐదో టెస్ట్‌లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. చివరి రోజు ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు అవసరం అయ్యాయి. కానీ భారత్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా వికెట్లు తీసింది. దీంతో ఈ సిరీస్ 2-2గా సమం చేసింది. ఈ సిరీస్‌లో భారత్ ఓటమి పాలవుతుందని అందరూ భావించారు. ఎందుకంటే సీనియర్ ఆటగాళ్లు లేరు,కొత్త కెప్టెన్సీ, మూడు మ్యాచ్‌లు గెలిచే సరికి 1-2తో టీమిండియా వెనుక పడింది. దీంతో పక్కా ఇండియా ఓటమి పాలవుతుందని భావించారు. కానీ సిరీస్ ముగిసే సరికి టీమిండియా విజయం సాధించింది.
ఇది కూడా చూడండి: IND Vs ENG 5th Test: చరిత్రలో తొలిసారి.. 60 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా
Not a single TRUE #MohammedSiraj or #IndianCricketTeam fan dares scroll past this 💥🇮🇳🩷💪👈
— SONU SINGH 🇮🇳 (@Sonu_Singh93) August 4, 2025
India won by 6 runs ❤️ #OvalTest 🩷#INDvsENG#OvalTest#INDvsENGTest#Siraj#OvalTestpic.twitter.com/pcRccA5l15
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు..
ఇంగ్లాండ్ జట్టు 374 పరుగుల లక్ష్య ఛేదనతో 339/6 స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించింది. ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు అవసరం ఉంది. కానీ ఇంగ్లాండ్ జట్టు 367 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మ్యాచ్ ప్రారంభం అయిన తర్వాత మొదటి ఓవర్‌లో జేమీ ఒవర్టన్ రెండు ఫోర్లు తీశాడు. ఆ తర్వాతే ఓవర్టన్‌ను టీమిండియా పెవిలియన్‌కు చేర్చింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో సిరాజ్ మొత్తం ఐదు వికెట్లు, ప్రసిద్ధ్ 4, ఆకాశ్ దీప్ 1 వికెట్ పడగొట్టారు. ఇందులో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులు, ఇంగ్లాండ్ జట్టు 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మహమ్మద్ సిరాజ్ 9 వికెట్లు పడగొట్టడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. హ్యారీ బ్రూక్, శుభమన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సాధించారు.
If the world is against Siraj, then I’m against the world🔥🇮🇳
— RAHUL SINGH (@RAHULKUMAR705) August 4, 2025
TAKE A BOW, MOHD. SIRAJ! 🙇 #INDvsENGTest#INDvsENG#ENGvIND#Sirajpic.twitter.com/cSs8d5UUQ7
ఇది కూడా చూడండి: Shubman Gill: 47 ఏళ్ల రికార్డు బద్దులు.. సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్ చేసిన గిల్!