/rtv/media/media_files/2025/08/03/ind-vs-eng-5th-2025-08-03-12-31-18.jpg)
IND Vs ENG 5th
భారత్ vs ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇది చివరి టెస్ట్ మ్యాచ్. ప్రస్తుతం ఈ మ్యాచ్ లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్ స్టేడియంలో జరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌లు గెలిచి ముందు వరుసలో ఉంది. మరొక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
IND Vs ENG 5th Test
ఈ చివరి ఆఖరి మ్యాచ్ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఇంగ్లాండ్ చూస్తుంటే.. ఈ మ్యాచ్ గెలిచి ఇంగ్లాండ్‌తో 2-2 సమం చేయాలని భారత్ భావిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
ఇదిలా ఉంటే ఈ చివరి టెస్ట్‌లో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌట్ అయి.. ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (118) సెంచరీతో చెలరేగాడు. ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ (66), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) అర్ధ సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అలాగే గస్ అట్కిన్సన్ 3 వికెట్లు పడగొట్టి జోష్‌కు తోడుగా నిలిచాడు.
Stumps on Day 3 at the Oval 🏟️
— BCCI (@BCCI) August 2, 2025
A fantastic day with the bat for #TeamIndia 🙌
England 50/1 in the 2nd innings
India need 9⃣ wickets to win the fifth and final Test!
Scorecard ▶️ https://t.co/Tc2xpWNayE#ENGvINDpic.twitter.com/fILzecV2jy
ఇక మూడో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లాండ్ ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 324 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ గెలవాలంటే మరో 9 వికెట్లు తీయాలి. ఈ క్రమంలో టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అద్భుతం చేసింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొత్తం 470 బౌండరీలు కొట్టడం ద్వారా అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. వీటిలో 422 ఫోర్లు, 48 సిక్సర్లు ఉన్నాయి.
తొలిసారి 400కు పైగా బౌండరీలు
అదే సమయంలో ఓవల్ టెస్ట్‌లో మూడో రోజు మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన జట్టుగా భారతదేశం రికార్డు సృష్టించింది. చరిత్రలో తొలిసారిగా.. టీమిండియా ఒక టెస్ట్ సిరీస్‌లో 400 కంటే ఎక్కువ బౌండరీలు కొట్టింది. అంతకుముందు 1964లో భారతదేశం ఒక సిరీస్‌లో 384 బౌండరీలు కొట్టింది. ఇది 60 సంవత్సరాల రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును టీమిండియా బద్దలు కొట్టి 470 బౌండరీలు బాదింది. అయితే బౌండరీలు మాత్రమే కాదు.. ఈ సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్ మొత్తం 28 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశారు. ఇది టెస్ట్ సిరీస్‌లో ఏ జట్టు సాధించలేని రికార్డ్‌గా క్రియేట్ అయింది.
టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్లు
2025 ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో టీమిండియా మొత్తం 3,809 పరుగులు చేసింది. దీనిబట్టి సగటున 42.32గా నమోదైంది. ఈ రికార్డుతో టీమిండియా రెండవ అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. మొదటి జట్టు ఆస్ట్రేలియా. ఇది 1989 యాషెస్ సిరీస్‌లో 6 మ్యాచ్‌ల్లో 3,877 పరుగులు చేసింది. దీని సగటు 57.86గా ఉంది.