DK: రీ ఎంట్రీ ఇచ్చిన దినేష్ కార్తిక్.. రాయల్స్ తరపున బరిలోకి!

భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ రీ ఎంట్రీతో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్‌లో (SA20) బరిలోకి దిగిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. పార్ల్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన డీకే క్రికెట్ అభిమానులను అలరించాడు.

New Update
dinesh karthik

Dinesh Karthik SA20 debut

DK: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ రీ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు  తాను తీసుకున్న ఈ నిర్ణయంతో అరుదైన ఘనత దక్కించుకున్నాడు. ఈ మేరకు ఈ సారి దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్‌లో (SA20) బరిలోకి దిగిన తొలి భారతీయ సూపర్ స్టార్‌గా నిలిచాడు. 

పార్ల్ రాయల్స్ తరఫున బరిలోకి..

ఈ మేరకు శనివారం బోలాండ్ పార్క్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన దినేష్ కార్తీక్ తన సొగసైన కీపింగ్, మాటలతో క్రికెట్ అభిమానులను అలరించాడు. పార్ల్ రాయల్స్‌కు అరంగేట్రం చేసిన కార్తీక్‌ను 'మీరు SA20లో ఆడాలని ఎందుకు నిర్ణయించుకున్నారు?' అని కామెంటర్ ప్రశ్నించగా.. 'IPL టోర్నీ తర్వాత ఇదే అత్యుత్తమ లీగ్ అని నిజంగా నమ్ముతున్నా. కొంత పోటీ క్రికెట్ ఆడాలని అనుకున్నా. అందుకు ఇంతకంటే మంచి టోర్నమెంట్ ఉందని నేను అనుకోనంటూ ఆసక్తికర సమాధానాలు చెప్పాడు.

'38 ఏళ్ల నేను రాయల్స్ ఫ్రాంచైజీకి ఆడాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నా. యాదృచ్ఛికంగా ఇప్పుడు ఆ అవకాశం లభించింది. IPL కెరీర్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడలేదు. ఇప్పుడు ఆ అవకాశం లభించింది. రాయల్స్ సెటప్‌లో భాగం కావాలని కోరుకుంటాను. నా స్నేహితులు చాలా మంది రాయల్స్ సెటప్ కోసం ఆడారు. కాబట్టి ఆఫర్ వచ్చినప్పుడు వదలుకోకూడదనుకున్నా. ఇది చాలా సంతోషంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇది కూడా చదవండి: Cricket: టీమ్ ఇండియాలో మొదలైన అంతర్గత విభేదాలు.. గంభీర్ వల్లే ఓటములు!

ఇక ఈ టోర్నీ జనవరి 9తో మొదలవగా ఫిబ్రవరి 8న ముగుస్తుంది. ఫైనల్ కు జోహన్నెస్‌బర్గ్‌ ఆతిధ్యమిస్తుంది. ఇప్పటివరకు ఈ లీగ్ రెండు సీజన్ లు జరిగింది. రెండు సార్లు సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్ టైటిల్ విజేతగా నిలిచింది. సెయింట్ జార్జ్ పార్క్‌లో క్వాలిఫైయర్ 1, సెంచూరియన్‌లో ఎలిమినేటర్‌, క్వాలిఫయర్ 2 మ్యాచ్ లు జరగనున్నాయి.  

పార్ల్ రాయల్స్ స్క్వాడ్:
డేవిడ్ మిల్లర్ (సి), దేవాన్ మరైస్, జో రూట్, మిచెల్ వాన్ బ్యూరెన్, సామ్ హైన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, దయాన్ గెలీమ్, కీత్ డడ్జియోన్, దినేష్ కార్తీక్, లువాన్-డ్రే ప్రిటోరియస్, రూబిన్ హెర్మాన్, జోర్న్ ఫోర్టుయిన్, కోడి యూసుఫ్, దునిత్ మా వెల్లలాగే, ఇషాన్ మా వెల్లలింగే , క్వేనా మఫాకా, లుంగి ఎన్‌గిడి, ముజీబ్ ఉర్ రెహమాన్, నకాబా పీటర్.

ఇది కూడా చదవండి: BIG BREAKING: ఆ ముగ్గురు మంత్రులు ఔట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు