/rtv/media/media_files/2025/01/30/LSEUdMiBDOsugWoyowKV.jpg)
Dhoni, Gambhir
Gambhir: భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య వివాదాలున్నట్లు చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా ధోనీ అంటే గంభీర్‌కు పడదనే కామెంట్స్‌పై గంభీర్ చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ క్లారిటీ ఇచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజయ్.. నిజానికి గంభీర్ ను అందరూ తలతిక్కవాడుగా భావిస్తారన్నారు. కానీ దేశం కోసం ఆడుతున్నపుడు గౌతిలో చాలా నిబద్ధత ఉంటుందని చెప్పాడు.
దేనిని మనస్సులో పెట్టుకోడు..
‘గౌతమ్ గంభీర్ అందరిపట్ల ప్రేమ కలిగి ఉంటాడు. ఎవరిని శత్రువుగా చూడడు. ఇదే నిజం. కానీ చాలామంది ధోనీ అంటే గంభీర్‌కు ఇష్టం లేదనే అంటుంటారు. విరాట్ విషయంలోనూ అలాగే మాట్లాడుకుంటారు. కానీ గౌతికి ఎవరిమీదా వ్యక్తిగత కోపం లేదు. ఉండదు. దేనిని మనస్సులో పెట్టుకోడు. 2004లో ఇండియా Aసిరీస్ జరిగినపుడు ధోనీ-గంభీర్ మధ్య గొడవ జరిగినట్లు చెబుతుంటారు.
అదంతా పుకారే. ఎందుకంటే ఆ సమయంలో వారిద్దరూ రూమ్ మెట్స్. ఐపీఎల్ లో కోహ్లీతో వాగ్వాదం గురించి నాతో చర్చించాడు. అక్కడ ఏది సరైనదో మీకు, అందరికీ తెలుసన్నాడు. జట్టు సభ్యుల కోసం గంభీర్ ఎంతవరకైనా వెళ్తాడు. మొత్తంగా ఏది జరిగినా గ్రౌండ్ వరకే పరిమితం చేస్తాడు' అని సంజయ్ తెలిపారు.
— Raqoo (@CinemaSage0) August 20, 2020
ఇది కూడా చదవండి: live-in relationship: పెళ్లి కాకున్నా కలిసి జీవించాలంటే ఈ రూల్స్ పాటించాలి