/rtv/media/media_files/2025/04/22/sIgw5EPkvfLqLii2tRO7.jpg)
DC VS LSG
లక్నో సూపర్ జెయింట్స్ మళ్ళీ మ్యాచ్ ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 8వికెట్ల తేడాతో మ్యాచ్ ను కోల్పోయింది. లక్నో ఇచ్చిన 159 టార్గెట్ ను ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అభిషేక్ పోరెల్ 36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌లతో 51 పరుగులు, కేఎల్ రాహుల్ 42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 పరుగులు, అక్షర్ పటేల్ 24 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌లు 34 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్ ను సునాయాసంగా గెలిచేశారు. ఢల్లీ బ్యాటర్లను సూపర్ జెయింట్స్ బౌలర్లు ఏ మాత్రం కట్టడి చేయలేకపోయారు. లక్నో బౌలర్లలో మార్‌క్రమ్ రెండు వికెట్లు తీశాడు.
రాణించిన మార్ క్రమ్, మిచెల్ మార్ష్..
లక్నో వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటింగ్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు ఐదెన్ మార్‌క్రమ్ (52), మిచెల్ మార్ష్ (45) రాణించారు. నికోలస్ పూరన్ (9), అబ్దుల్ సమద్ (2) విఫలమయ్యారు. డేవిడ్ మిల్లర్ (14) పరుగులు చేశాడు.ఆయుష్ బదోని (36) దూకుడుగా ఆడాడు. 9.5 ఓవర్లకు 87/0తో పటిష్టస్థితిలో లక్నో .. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఊహించిన దానికన్నా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, మిచెల్ స్టార్క్, దుష్మాంత చమీర ఒక్కో వికెట్ పడగొట్టారు.
today-latest-news-in-telugu | IPL 2025 | lsg | dc | match
Also Read: BIG BREAKING: వైసీపీ నుంచి దువ్వాడ ఔట్.. జగన్ సంచలన ప్రకటన!