/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/MLC-Duvvada.jpg)
ఎమ్మెల్సీ దువ్వాడపై మొత్తానికి వేటు పడింది. గత కొన్ని రోజలుగా వార్తల్లో నిలుస్తున్న దువ్వాడ శ్రీనివాస్ పై ఎట్టకేలకు వైసీపీ అధ్యక్షుడు జగన్ చర్యలు తీసుకున్నారు. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పినట్లు ఫిర్యాదులు రావడం వలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూ కొద్దిసేపటి క్రితం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
జగన్ చెప్పిన మాట వినకపోవడం వల్లనే..
పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పిన మాట వినకపోవడం వల్లనే దువ్వాడను సస్పండ్ చేశారని తెలుస్తోంది. సుదీర్ఘ కాలం తర్వాత జగన్ ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. ఈ క్రమంలో టెక్కలి వైసీపీ ఇన్ ఛార్జి పేరాడ తిలక్ కి మద్దతు తెలపమని జగన్ అడిగారు. కానీ దీనికి దువ్వాడ ఒప్పుకోలేదు. దీంతో వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశించారని చెబుతున్నారు. నాయకుడు చెప్పిన వెంటనే సస్పెన్షన్ ను అమలు చేసింది పార్టీ కేంద్ర కమిటీ. దీంతో ఇప్పటి వరకు జగనే నా దేవుడు అన్న దువ్వాడ దారెటో అని పార్టీ జనాలు అనుకుంటున్నారు. ఇతని సస్పెన్షన్ తో టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. కుటుంబ కలహాలే దువ్వాడకు శాపంగా పరిణించాయని..ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో వాణి హాస్తం వుందని మాట్లాడుకుంటున్నారు.
/rtv/media/media_files/2025/04/22/dH928pElFahQzgGmSgub.jpeg)
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైయస్ఆర్సీపీ అధ్యక్షులు @ysjagan గారి ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. pic.twitter.com/kjFfWhSPCI
— YSR Congress Party (@YSRCParty) April 22, 2025
today-latest-news-in-telugu | duvvada-srinivas | ycp | suspend
Also Read: J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్