/rtv/media/media_files/2025/04/16/Krv5MP2uNctFpbM5H0AY.jpg)
Abishek Porel AND KL RAHUL
10 ఓవర్లు పూర్తి
ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తాజాగా 10 ఓవర్లు పూర్తి చేసుకుంది. ఈ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్‌లో అభిషేక్ పొరెల్ (40*), కేఎల్ రాహుల్ (27*) ఉన్నారు.
Also read : తెలంగాణ టెన్త్ ఫలితాలపై బిగ్ అప్‌డేట్.. అది తేలితేనే ఫలితాలు !
కాగా ఓపెనర్స్‌గా వచ్చిన జేక్ ఫ్రేజర్, అభిషేక్ పొరెల్ దుమ్ము దులిపేశారు. ఈ ఇద్దరూ మొదటి నుంచి దూకుడుగా ఆడటం ప్రారంభించారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదారు. ఇలా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. అయితే రెండో ఓవర్‌లో మాత్రం పొరెల్ బంతిని ఉతికారేశాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన రెండో ఓవర్‌లో పొరెల్ దుమ్ము దులిపేశాడు.
Also read : పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!
వరుసగా ఫోర్లు, సిక్సర్ రాబడుతూ పరుగుల వరద పెట్టించాడు. ఈ రెండో ఓవర్‌లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. వరుసగా 4, 4, 6, 4, 4, 1 బాదేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు పొరెల్. దీంతో ఢిల్లీ స్కోర్ 2 ఓవర్లకు 33 పరుగులు చేసింది. అంతలోనే ఢిల్లీ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ జేక్ ఫ్రేజర్ (9) ఔటయ్యాడు. ఆ తర్వాత కరుణ్ నాయర్ క్రీజ్‌లోకి వచ్చి ఎక్కువ సమయం నిలవలేకపోయాడు. రన్ ఔట్ అయ్యాడు. అతడు (0) పరుగులకే వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్‌లో పొరెల్, కేఎల్ రాహుల్ ఉన్నారు. ఇద్దరూ నిలకడగా ఆడుతున్నారు.
Also read : ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి
dc-vs-rr | latest-telugu-news | IPL 2025 DC vs RR Live Score
Also read : పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!