J&K Terror Attack : మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి కాల్పులు!

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని  ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్‌లో వచ్చి మరి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పది మందికి బుల్లెట్ గాయాలు కాగా ఇందులో  ఐదుగురు పర్యాటకుల మృతి  చెందగా.. మరో పదిమందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

New Update

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పహెల్‌గామ్‌లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దొంగదెబ్బ తీశారు. ఏడుగురు ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్‌లో వచ్చి మరీ కాల్పులు జరిపారు.  పేరు ఏంటీ, మతం ఏంటని అడుగుతూ ముస్లింలు అయితే పక్కన పెట్టి మిగితా వారిని కాల్చి చంపేశారు. ఓ మహిళ భర్తను చంపేసి ఆమెను మాత్రం వదిలేశారు.  నన్ను కూడా చంపేయమని ప్రాధేయపడగా..   ఇక్కడ జరిగిన ఘటనను దేశానికి చెప్పేందుకు నువ్వు ఉండాలంటూ ఆమెను వదిలేశారు.  కాగా  ఈ ఘటనలో పది మందికి బుల్లెట్ గాయాలు కాగా ఇందులో  ఐదుగురు పర్యాటకుల మృతి  చెందగా.. మరో పదిమందికి పైగా తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 

దాడికి పాల్పడింది మేమే : టీఆర్ఎఫ్

ఉగ్రవాదులను వేటాడేందుకు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో తమిళనాడు,ఒడిశా,గుజరాత్, మహారాష్ట్ర,కర్నాటకకు చెందిన టూరిస్ట్‌లకు గాయాలయ్యాయి.  అయితే ఈ దాడికి పాల్పడింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటించింది.   అమర్‌నాథ్ యాత్రకు కొద్దిసేపటి ముందు ఈ దాడి జరగడం కలకలం రేపింది. అమర్‌నాథ్ యాత్ర భద్రత గురించి ప్రశ్నలు తలెత్తాయి. 

మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడిని ప్రధాని మోదీ ఖండించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడిన మోదీ..  తగిన చర్యలు తీసుకోవాలని షాకు సూచించారు.  ఘటనాస్థలానికి వెంటనే వెళ్లాలని అమిత్ షాకి మోదీ ఆదేశాలు జారీ చేశారు.  మోదీ కూడా జమ్ముకశ్మీర్‌లోని ఘటనాస్థలానికి వెళ్లనున్నారు.  జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడిని ఆ రాష్ట్ర సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఖండించారు.  దాడికి పాల్పడినవారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదని ట్వీట్‌ చేశారు.  

 

 jammu-and-kashmir | tourists | pm-narendra-modi 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు