Cricket New Rules: క్రికెట్‌ కొత్త రూల్స్.. నిబంధనలు అతిక్రమిస్తే భారీ మూల్యం తప్పదు!

క్రికెట్‌లో ప్రస్తుతం ఐసీసీ కొన్ని మార్పులు తీసుకొచ్చారు. స్టాప్ క్లాక్ రూల్, 35 ఓవర్ల తర్వాత ఒకే బంతి, బౌండరీ లైన్ క్యాచ్ రూల్స్‌ను మార్చింది. ఇవి జూలై 2వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

New Update
Cricket new rules

Cricket new rules

క్రికెట్‌లో ప్రస్తుతం ఐసీసీ కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఈ కొత్త రూల్స్ జూలై 2వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఐసీసీ మార్చిన ఆ రూల్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

స్టాప్ క్లాక్ రూల్

ఓవర్ ముగిసిన తర్వాత.. మరో ఓవర్‌ను 60 సెకన్లలోపు ఆరంభించాల్సి ఉంటుంది. ఈ నిబంధన ఉల్లంఘిస్తే రెండుసార్లు హెచ్చరిస్తారు. మూడోసారి కూడా రిపీట్ చేస్తే బ్యాటింగ్ జట్టుకు అదనంగా 5 పరుగులను కేటాయిస్తారు. ఇక అదే సమయంలో బౌలింగ్ జట్టు నుంచి 5 పరుగులను కట్ చేస్తారు. ప్రతీ 80 ఓవర్లకు ఈ రూల్ రీస్టార్ట్ అవుతుంది. 

ఇది కూడా చూడండి: Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్‌ మస్క్‌ కీలక సూచనఇన్నింగ్స్ ప్రారంభం నుంచి 50వ ఓవర్ దాకా రెండు బంతులు వాడుతూ బౌలింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ నిబంధన మారనుంది. ఇకపై ఈ రూల్ 35 ఓవర్ల వరకే ఉంటుంది. అంటే 34 ఓవర్లు ముగిసేదాకా రెండు బంతులను వాడుకొని బౌలింగ్ చేయవచ్చు. కానీ 35వ ఓవర్ తర్వాత 50వ ఓవర్ దాకా ఏదైనా ఒకటే బంతితో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. వర్షం వల్ల లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ 35 ఓవర్లకు కుదించితే ఒక్క బంతితోనే బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.

ఇది కూడా చూడండి:Fruits and Milk: ఈ పండ్లు పాలు తాగితే శరీరంలో విషంగా మారుతుందా..? ఇలా జాగ్రత్తలు తీసుకోండి..!!

ఫీల్డర్ బౌండరీ లైన్ దాటి గాలిలో బంతిని అందుకుంటే, ఒకేసారి మాత్రమే తిరిగి లోపలికి రావాలి. ఇలా విసిరిన బంతిని వెంటనే లైన్ లోపలికి వచ్చి పట్టుకోవాలి. అప్పుడే అది క్యాచౌట్​‌గా పరిగణిస్తారు. బౌండరీ లైన్ బయట నుంచి బంతిని రెండుసార్లు గాల్లోకి విసిరితే సిక్స్‌‌గా భావిస్తారు.

ఇది కూడా చూడండి:Kannappa: 'కన్నప్ప' లో ఆ సీన్ సినిమాకే హైలైట్.. మంచు విష్ణు నటనకు కన్నీళ్లు ఆగవు!

ఉమ్మి రాయడం
కరోనా నుంచి బంతికి ఉమ్మి రాయడాన్ని నిషేధించారు. అయితే ఐపీఎల్ 2025లో బంతికి ఉమ్మి రాయడాన్ని అనుమతించారు. అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం బంతికి ఉమ్మి రాయడంపై నిషేధం ఇలాగే కొనసాగుతుంది. బౌలింగ్‌ జట్టు బంతి మార్పు కోసం ఉద్దేశపూర్వకంగా ఉమ్మి రాసినా, బంతి మార్పు అనేది తప్పనిసరి కాదు. బంతి మార్పు నిర్ణయం ఇకపై అంపైర్ల చేతిలోనే ఉంటుంది. బంతి పరిస్థితి మారితేనే దాన్ని మారుస్తారు.

ఇది కూడా చూడండి:VIRAL VIDEO: షాకింగ్ వీడియో.. తన మూత్రంతో కళ్ళు కడుకున్న మహిళ - దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

Advertisment
తాజా కథనాలు