Rohith Sharma: రిటైర్మెంట్‌పై రోహిత్ కీలక ప్రకటన

వన్డే క్రికెట్‌పై రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత రిటైర్మెంట్ గురించి విలేకర్లు ప్రశ్నించారు. దీనికి రోహిత్ స్పందిస్తూ భవిష్యత్తు ప్రణాళికల బట్టి నిర్ణయాలు మారవచ్చు. కానీ, ప్రస్తుతానికి రిటైర్మెంట్ కావడం లేదని తెలిపారు. 

New Update
ICC Rohith

ICC Rohith Photograph: (ICC Rohith)

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ 2025లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై టీమిండియా జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తారని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మను విలేకర్లు రిటైర్మెంట్ గురించి ప్రశ్నించారు. దీనికి రోహిత్ స్పందిస్తూ.. ఇప్పుడే రిటైర్ కావడం లేదని తెలిపారు. భవిష్యత్తు ప్రణాళికల బట్టి నిర్ణయాలు మారవచ్చు. కానీ, ప్రస్తుతానికి అయితే రిటైర్మెంట్ చేయడం లేదని తెలిపారు. 

ఇది కూడా చూడండి:BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం

ఇది కూడా చూడండి:HYD: హైదరాబాద్ లో మిన్నంటిన సంబరాలు..పోలీసుల లాఠీ ఛార్జ్

టాప్ స్కోరర్‌గా రోహిత్..

ఇదిలా ఉండగా దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా 4 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది. రోహిత్ 76 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ (1) ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశపర్చాడు. శ్రేయస్ అయ్యర్ (48), కేఎల్ రాహుల్ (34*), శుభ్‌మన్ గిల్ (31), అక్షర్ పటేల్ (29), హార్దిక్ పాండ్య (18), రవీంద్ర జడేజా (9*) పరుగులు చేశారు. మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో ఓవర్ ఉండగానే ఘన విజయం సాధించింది.

ఇది కూడా చూడండి:ind vs nz: భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. హైలైట్స్ ఇవే!

ఇది కూడా చూడండి:Champions Trophy 2025: ఇది మన సత్తా.. టీమ్ ఇండియాపై ప్రముఖుల ప్రశంసలు!

Advertisment
తాజా కథనాలు