Aus Vs Afg: టాస్ గెలిచిన అఫ్గాన్.. 0 పరుగులకే వన్ వికెట్ డౌన్!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అఫ్గానిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య కీలక మ్యాచ్‌ మొదలైంది. లాహోర్‌ గడాఫీ స్టేడియం వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ 0 పరుగులకే వికెట్ కోల్పోయింది. గెలిచిన జట్టు సెమీస్ చేరే అవకాశం ఉంది.

New Update
aus vs afg

Champions Trophy Aus vs Afg

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అఫ్గానిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య కీలక మ్యాచ్‌ మొదలైంది. లాహోర్‌ గడాఫీ స్టేడియం వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ 0 పరుగులకే వికెట్ కోల్పోయింది. ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకంకానుంది. 

అఫ్గాన్లు రీవేంజ్ తీసుకుంటారా.. 

గత మ్యాచ్ లో ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన అఫ్గాన్ ఇప్పుడు ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాలని చూస్తోంది. 2024 టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌ను అఫ్గాన్‌ మట్టికరిపించిన సంగతి తెలిసిందే. కాగా ఇక్కడ ఆఫ్గాన్ కు మరో ప్రమాదం పొంచివుంది. శుక్రవారం లాహోర్‌లో వర్షం కురిసే అవకాశాలు 75 శాతం ఉండగా మ్యాచ్‌ రద్దయితే ఆస్ట్రేలియా 4 పాయింట్లతో సెమీస్‌ చేరుకుంటుంది. మరోవైపు 2019 వరల్డ్ కప్ లో గెలుపు తీరాలకు చేరిన ఆఫ్గాన్ ను ఆసీస్ బ్యాట్స్ మెన్ మ్యాక్స్ వెల్ ఒంటిచేత్తే లాగేసుకున్నాడు. డబుల్ సెంచరీతో అఫ్గాన్ సెమీస్ చేరకుండా చేశాడు. దీంతో మెగా టోర్నీలో ఆసీస్ ను ఎలాగైనా దెబ్బకొట్టాలని పంతంతో ఉన్నారు. 

ఆస్ట్రేలియా తుది జట్టు:
మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవ్‌ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కెరీ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ డ్వారషూస్‌, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్. 

అఫ్గానిస్థాన్ తుది జట్టు:
రెహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్,  రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్‌ హక్ ఫారూఖీ.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు