టీమిండియా స్టార్ ప్లేయర్, సీనియర్ స్పిన్నర్ అశ్విన్ రిటైర్మెంట్ అందరినీ షాక్ కి గురిచేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అశ్విన్ తీసుకున్న డెసిషన్ భారత్ క్రికెట్ ప్రియులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. దీంతో చాలా మంది అశ్విన్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని చర్చించుకున్నారు. తన టెక్నిక్ తో ఎలాంటి బ్యాటర్ ని అయినా గజగజలాడించిన అశ్విన్ రిటైర్మెంట్ తీసుకోవడానికి గల కారణం గురించే అంతా మాట్లాడుకున్నారు. Also read: అలా చేయడం లైంగిక వేధింపుతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు ప్రముఖ క్రికెటర్ లు, మాజీ దిగ్గజాలు సైతం అతడి నిర్ణయానికి ఖంగుతిన్నారు. దీంతో టీమిండియాలో ఏవో లుకలుకలు జరుగుతున్నట్లు యావత్ సినీ ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా అశ్విన్ ఎందుకు ఇలాంటి సడన్ డెసిసన్ తీసుకున్నాడో పలువురు క్రికెట్ ప్రముఖులు సైతం ఇప్పటికే వెల్లడించారు. అశ్విన్ రిటైర్మెంట్ పై తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హడిన్ తన అభిప్రాయాన్ని తెలిపారు. Also Read: ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత హిమాలయాలకు పోతా..సీఈసీ రాజీవ్ కుమార్ ఇది 'తమాషా' విషయం అశ్విన్ రిటైర్మెంట్ ను 'తమాషా' విషయంగా అభివర్ణించారు. అంతేకాకుండా టీమిండియాఎలాంటి ప్రణాళికలు లేకుండా ఆసీస్ పర్యటనకు వచ్చినట్లు పేర్కొన్నారు. అశ్విన్ ను బెంచ్ పై కూర్చోబెట్టడం వల్లనే అశ్విన్ చాలా నిరుత్సాహానికి గురై రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపారు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా తొలి మూడు టెస్టులను ముగ్గురు స్పిన్నర్లతో ఆడిందని అన్నారు. Also Read : అస్సాం బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి దీని బట్టి చూస్తే టీమిండియా జట్టు ఎలాంటి ప్రణాళికలు లేకుండానే ఆసీస్ పర్యటనకు వచ్చినట్లు తనకు అనిపించినట్లు పేర్కొన్నారు. ఈ సిరీస్ లో టీమిండియా విజయం సాధించిన తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే అప్పుడు ఎలాంటి సమస్య ఉండకపోదునని అన్నారు. కానీ అశ్విన్ సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించడం తమాషాగా ఉందని చెప్పుకొచ్చారు. అయితే అతడు వీడ్కోలు పలకడానికి కూడా ఓ కారణం ఉందని చెప్పుకొచ్చారు. ఇది కూడా చదవండి: మధుమేహంతో ఇబ్బందిగా ఉందా.. ఈ ఆకులు తింటే మీ వ్యాధి పరార్ ఎక్కువ మ్యాచ్ లు రిజర్వ్ బెంచ్ పై కూర్చోవడం వల్లనే అతడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని అన్నారు. ఆసీస్ పై అద్భుతమైన రికార్డు ఉన్న స్పిన్నర్ గా తాను బెంచ్ పై కూర్చోలేనని.. అలా కూర్చున్నాననంటే తాను టాలెంట్ గల స్పిన్నర్ కాదని భావించి ఉంటాడని.. అందువల్లనే దీన్ని ఇక్కడితో ఆపేస్తే బాగుంటుందని ఫీలై అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి ఉంటాడని అభిప్రాయపడ్డాడు.