IPL 2025 Postponed: ఇట్స్ అఫీషియల్.. IPL 2025 రద్దు!

ఐపీఎల్ 2025 సీజన్‌పై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్‌ను వాయిదా వేసింది. పరిస్థితులు సర్దుమనిగేంత వరకు నిరవదికంగా వాయిదా వేసింది. ఇదే విషయాన్ని బీసీసీఐ అఫీషియల్‌గా తెలిపింది. దీని ప్రకారం.. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు రద్దు అయ్యాయి.

New Update
IPL 2025 postpone

భారత్ -  పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం మరింత ముదిరింది. దీంతో నిన్న (గురువారం) పంజాబ్ కింగ్ VS ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ మధ్యలోనే ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగుతుందా? లేదా? అని అభిమానులు ఆందోళనలో ఉన్నారు. 

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

IPL 2025 POSTPONED

ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌ను వాయిదా వేసింది. మొత్తంగా కాకుండా పరిస్థితులు సర్దుమనిగేంత వరకు నిరవదికంగా వాయిదా వేసింది. దీని ప్రకారం.. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మ్యాచ్‌లు జరగవు. ఇదే విషయాన్ని బీసీసీఐ అఫీషియల్‌గా తెలిపింది. 

Also Read :  ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దు

ఈ సీజన్ ఐపీఎల్‌లో టాప్ 3 స్థానాల్లో గుజరాత్ టైటాన్స్ మొదటి ప్లేస్‌లో ఉంది. సెకండ్ ప్లేస్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. పంజాబ్ కింగ్స్ మూడో స్థానంలో కొనసాగుతోంది. 

ఇది కూడా చూడండి: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ జట్టు 8 గెలుపొంది.. 3 ఓడింది. దీంతో 16 పాయింట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అదే సమయంలో ఆర్సీబీ మొదటి నుంచి అద్భుతమైన ఫామ్ కనబరుస్తుంది. మధ్యలో తడబడ్డా.. ఆ తర్వాత పుంజుకుంది. దీంతో ఈ జట్టు కూడా 11 మ్యాచ్‌లు ఆడి 8 గెలిచింది. మరో 3 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఇది కూడా 16 పాయింట్లను పొంది సెకండ్ స్థానాన్ని దక్కించుకుంది. 

ఇది కూడా చూడండి: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

రన్ రేట్‌ కాస్త తక్కువగా ఉండటంతో ఈ స్థానం లభించింది. ఇక మూడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ మొత్తం 12 మ్యాచ్‌లు ఆడింది. అందులో 7 మ్యాచ్‌లను గెలుపొందగా.. 3 మ్యాచ్‌లు ఓడిపోయింది. మరో 2 మ్యాచ్‌లు డ్రా గా ముగిసాయి. దీంతో పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ VS  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది.

IPL 2025 CANCEL | latest-telugu-news

Advertisment