PSL 2025: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దు

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య మరింత ఉద్రిక్తతపరిస్థితులు నెలకొన్నాయి. పాక్‌లో ఇవాళ జరగాల్సిన PSL మ్యాచ్ రద్దైంది. రావల్పిండి స్టేడియంలో నేడు మ్యాచ్ జరగాల్సింది. కానీ దానిసమీపంలో పేలుడు సంభవించడంతో పెషావర్‌జల్మీ, కరాచీకింగ్స్ మధ్య మ్యాచ్ రద్దైంది.

New Update
PSL match cancelled

PSL match cancelled

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య మరింత ఉద్రిక్తతపరిస్థితులు నెలకొన్నాయి. పాక్‌లో ఇవాళ జరగాల్సిన PSL మ్యాచ్ రద్దైంది. రావల్పిండి స్టేడియంలో నేడు మ్యాచ్ జరగాల్సింది. కానీ దానిసమీపంలో పేలుడు సంభవించడంతో పెషావర్‌జల్మీ, కరాచీకింగ్స్ మధ్య మ్యాచ్ రద్దైంది.

ఏం జరిగింది?

భారత్ -  పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవాళ పాక్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో డ్రోన్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. స్టేడియానికి సమీపంలోనే దాడి జరిగినట్లు ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ స్టేడియంలో ఇవాళ (మే8) రాత్రి 8గంటలకు పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో భాగంగా పెషావర్ జల్మి vs కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. 

క్రికెట్ స్టేడియం సమీపంలో డ్రోన్ దాడి

ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఈ సంఘటన జరిగడం సంచలనంగా మారింది. ఈ దాడి తర్వాత PSL సూపర్‌లీగ్ కరాచీకి మార్చే అవకాశం ఉందని అనేక నివేదికలు పేర్కొన్నాయి. దీంతో భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ సంఘటన సమీపంలోని ఒక రెస్టారెంట్‌ భారీ స్థాయిలో ద్వంసం అయింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ డ్రోన్ గురించి దర్యాప్తు ప్రారంభించారు. కాగా లాహోర్, కరాచీలలో వేర్వేరుగా పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. 

నివేదిక ప్రకారం.. ఈ ప్రమాదంలో స్టేడియం సమీపంలోని రెస్టారెంట్ భవనం పాక్షికంగా ద్వంసం అయింది. స్థానిక పాకిస్తాన్ నివేదికల ప్రకారం.. అధికారులు ఆ ప్రాంతాన్ని సీజ్ చేసి, డ్రోన్ ఎక్కడ నుండి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ఇద్దరు పౌరులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

PSL 2025 | latest-telugu-news | telugu-news

Advertisment
తాజా కథనాలు