/rtv/media/media_files/2025/05/22/Xx3dKPj9LPQP9NzlDRNb.jpg)
BCCI announces India Under-19 squad for England tour
India tour of England: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే అండర్-19 భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూన్ 24- జూలై 23 వరకు 5 వన్డే, 2 మల్టీ- డే మ్యాచ్‌లు ఆడేందుకు 16మందితో కూడిన జట్టును సెలెక్ట్ చేశారు. వైభవ్ సూర్యవంశీకి ఇందులో చోటు దక్కగా ఆయుశ్ కెప్టెన్.
🚨 𝗡𝗘𝗪𝗦 🚨
— BCCI (@BCCI) May 22, 2025
India U19 squad for Tour of England announced.
Details 🔽
భారత జట్టు
ఆయుష్ మాత్రే (కెప్టెన్), అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, హర్‌వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), మొహ్మద్ ఇనాన్, ఆదిత్య రానా, అన్మోల్‌జీత్ సింగ్, ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర.
స్టాండ్ బై ప్లేయర్లు:
అలంకృత్ రాపోలే (వికెట్ కీపర్), నమన్ పుష్కక్, డి. దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారి.
Also Read: 52 ఏళ్ల వయసులో 30 ఏళ్ల యువకుడితో ప్రేమ.. ISI ఏజెంట్‌గా మారిన భారత రాయబారి..
🚨 AYUSH MHATRE WILL LEAD INDIA U-19 TEAM IN ENGLAND TOUR 🚨
— Johns. (@CricCrazyJohns) May 22, 2025
- Vaibhav Suryavanshi is part of the team. 🇮🇳 pic.twitter.com/kUDM0cZ1fE
-జూన్ 24-న లోబోరో యూనివర్సిటీలో వన్డే వార్మప్ మ్యాచ్
-జూన్ 27- తొలి వన్డే- హోవ్
-జూన్ 30- రెండో వన్డే- నార్తాంప్టన్
-జూలై 2- మూడో వన్డే- నార్తాంప్టన్
-జూలై 5- నాలుగో వన్డే- వోర్సెస్టర్
-జూలై 7- ఐదో వన్డే- వోర్సెస్టర్
-జూలై 12- తొలి మల్టీ డే మ్యాచ్- బెకింగ్‌హామ్
-జూలై 20- రెండో మల్టీ డే మ్యాచ్- చెమ్స్‌ఫోర్డ్.
భారత యువ జట్టుకు ముంబై ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం ఆయుశ్ మాత్రే కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. చెన్నై తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆయుశ్ మాత్రే 6 మ్యాచ్‌లు ఆడి 206 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఇక వైస్ కెప్టెన్ గా అభిజ్ఞాన్ కుందును సెలక్ట్ చేశారు. మరోవైపు ఐపీఎల్-2025లో అదరగొట్టిన రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఈ జట్టులో చోటు దక్కడం విశేషం. కాగా ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన 14 ఏళ్ల ఈ కుర్రాడు ఇంగ్లండ్ లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
elugu-news | today telugu news telugu-news