IND w Vs IRE w: ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌.. భారత కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్!

స్వదేశంలో ఐర్లాండ్‌తో భారత మహిళా జట్టు మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. దీంతో సెలక్షన్ కమిటీ స్క్వాడ్‌ను ప్రకటించింది. హర్మన్‌ ప్రీత్ కౌర్‌, రేణుకాసింగ్‌ విశ్రాంతి తీసుకోనున్నారు. దీంతో కెప్టెన్‌గా స్మృతి మంధాన, వైస్ కెప్టెన్‌గా దీప్తి శర్మ ఉండనున్నారు.

New Update
India Women vs Ireland Women Squad

India Women vs Ireland Women Squad

భారత మహిళల క్రికెట్ జట్టు మరో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. రెండో మ్యాచ్ వడోదరలో జరగగా.. వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది. దీంతో ఈ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు స్వదేశంలో మరో సిరీస్‌కు రెడీ అయింది. 

నిరంజన్ షా మైదానం

Also Read :  భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా?

ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆడబోతుంది టీమిండియా జట్టు. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా మైదానం వేదికగా ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. క్రికెట్ ప్రియులు ఇప్పుడు ఈ సిరీస్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్‌ తొలి వన్డే జనవరి 10న ఉదయం 11 గంటలకు జరగనుంది. అలాగే సెకండ్ వన్డే జనవరి 12 ఉదయం 11 గంటలకు, మూడో వన్డే జనవరి 15, ఉదయం 11 గంటలకు జరగనుంది. 

Also Read : కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా

ఈ క్రమంలో మహిళా జట్టు సెలక్షన్ కమిటీ స్క్వాడ్‌ను అనౌన్స్ చేసింది. దాదాపు 15 మందితో కూడిన స్క్వాడ్‌ను వెల్లడించింది. అయితే టీమిండియా జట్టులో ఇద్దరికి విశ్రాంతి దొరికింది. రెగ్యులర్ సారథి హర్మన్ ప్రీత్ కౌర్, ఫాస్ట్ బౌలర్ రేణుకాసింగ్‌కు మేనేజ్‌మెంట్ విశ్రాంతి కల్పించింది. 

దీంతో కెప్టెన్సీ పగ్గాలను స్మృతి మంధానకు మేనేజ్‌మెంట్ అప్పగించింది. ఇక వైస్ కెప్టెన్‌గా దీప్తి శర్మను నియమించింది. అయితే మరి ఇరు టీంలు ప్రకటించిన స్క్వాడ్‌లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

భారత్: స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్),  జెమీమా రోడ్రిగ్స్, ప్రతీకా రావల్, తేజల్ హసబ్నిస్, హర్లీన్‌ డియోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్), ప్రియా మిశ్రా, తనుజా కాన్వెర్, సైమా ఠాకూర్, టిటాస్ సధు, రాఘ్వి బిస్త్, సయాలి సత్ఘరె వంటి స్క్వాడ్‌ ఉంది.

Also Read: తెల్లారే పింఛన్‌ ఇవ్వకపోతే ప్రపంచం తలకిందులవుతుందా?

ఐర్లాండ్‌: గాబీ లూయిస్ (కెప్టెన్), క్రిస్టినా కౌల్టర్ రీల్లే, అవా కానింగ్, అలానా డాల్జెల్, సారా ఫోర్బ్స్‌,  జార్జినా డెంప్సే, ఏమీ మగైరె, జొన్నా లాగ్హరన్, ఓర్లా ప్రెండరెగస్ట్, లీహ్ పాల్, ఫ్రెయా సర్గెట్, ఉనా రేమండ్, రెబెక్కా స్టాకెల్ స్క్వాడ్ ఉంది.

Advertisment
తాజా కథనాలు