/rtv/media/media_files/2025/09/29/mirai-collections-2025-09-29-07-05-21.jpg)
Mirai Collections
Mirai Collections: యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ డ్రామా మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా ఇప్పుడు నార్త్ అమెరికాలో $3 మిలియన్ కలెక్షన్ల మైలురాయికి చేరువలో ఉంది. శనివారం ఒక్క రోజులో అమెరికా, కెనడాల్లో కలిసి మిరాయ్ $55 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం $2.98 మిలియన్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.
Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!
#Mirai crosses $2.8 Million and is inching towards $3 Million landmark in North America 🇺🇸🇨🇦 pic.twitter.com/VubpGKJKBy
— idlebrain jeevi (@idlebrainjeevi) September 23, 2025
Mirai North America Collections
ఆదివారం నాటికి ఈ చిత్రం $3 మిలియన్ క్లబ్‌లో చేరనుంది. ఈ సూపర్ సక్సెస్ తో తేజ సజ్జా టాలీవుడ్‌లో ప్రభాస్, ఎన్టీఆర్‌ల తర్వాత వరుసగా రెండు సినిమాలతో $3 మిలియన్ మార్క్ అందుకున్న మూడో హీరోగా నిలిచాడు. ఇది ఆయన కెరీర్‌లో ఓ బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
ప్రపంచవ్యాప్తంగా కూడా మిరాయ్ దూసుకెళ్తోంది. ఇప్పటికే ₹150 కోట్లు వసూలు దిశగా ముందుకెళ్తోంది. ఈ సినిమాతో తేజ సజ్జా సక్సెస్ ఫుల్ హీరోగా తన స్థానం బలపరచుకున్నాడు. చిన్న హీరోగా పేరు తెచ్చుకున్న తేజ ఇప్పుడు పెద్ద హీరోల సరసన నిలిచాడు.
Also Read: ‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
ఈ చిత్రంలో మంచు మనోజ్, ఋతికా నాయక్, శ్రియా శరన్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కర్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. భారీ విజువల్స్, స్ట్రాంగ్ ఎమోషన్స్, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే మిరాయ్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.
ఈ విజయంతో తేజ సజ్జా క్రేజ్ మరింత పెరిగింది. మిరాయ్ టాలీవుడ్‌లోనే కాకుండా ఓ పాన్ ఇండియా విజయం సాధించిన సినిమా అని చెప్పొచ్చు. ఈ సూపర్ హిట్ తో తేజ తదుపరి ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి మిరాయ్ ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.