Kantara Telugu Event: తెలుగులో మాట్లాడు..? కాంతార హీరోపై నెటిజన్స్ ఫైర్

హైదరాబాద్‌లో జరిగిన కాంతారా చాప్టర్ 1 ఈవెంట్‌లో రిషబ్ కన్నడలో మాట్లాడటం చర్చనీయాంశమైంది. తెలుగు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌- రిషబ్ మధ్య బాండింగ్ హైలెట్ గా నిలిచింది. అక్టోబర్ 2న రానున్న ఈ చిత్రం, కాంతారా‌కు ప్రీక్వెల్‌గా రూపొందింది.

New Update
Kantara Telugu Event

Kantara Telugu Event

Kantara Telugu Event: హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన కాంతారా చాప్టర్ 1 తెలుగు వెర్షన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో హీరో, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి(Rishab Shetty) పాల్గొన్నారు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ పీరియడ్ ఫాంటసీ డ్రామా అక్టోబర్ 2న విడుదల కానుంది.

ఈ ఈవెంట్‌లో రిషబ్ శెట్టి తన స్పీచ్ మొత్తం పూర్తిగా కన్నడలో చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు ప్రేక్షకుల్లో కొందరు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "తెలుగు ప్రేక్షకుల కోసం సినిమా ప్రమోట్ చేస్తుంటే, కనీసం కొంచెం తెలుగు మాట్లాడాలి కదా" అంటూ ఓ యూజర్ ఎక్స్‌లో కామెంట్ చేశాడు.

Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!

Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!

NTR in Kantara Telugu Event

అయితే రిషబ్ శెట్టి మాత్రం తన ప్రసంగంలో తెలుగు ప్రేక్షకులను, తెలుగు సినిమా పరిశ్రమను ప్రశంసించారు. ముఖ్యంగా, ఎన్టీఆర్‌ను(NTR) తన స్నేహితుడు, సోదరుడు అంటూ పిలవడం అభిమానులకు చాలా నచ్చింది. ఈ ఈవెంట్ మొత్తం రిషబ్-ఎన్టీఆర్ మధ్య అనుబంధం స్పష్టంగా కనిపించింది. వీరి స్నేహం వీరి అభిమానులకు మంచి ఫీల్‌ను ఇచ్చింది.

Also Read: ‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..

కాంతారా చాప్టర్ 1 ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కాంతారా చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మక్కళికి నచ్చేలా గ్రామీణ నేపథ్యంలో, పౌరాణిక తత్వాలతో రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.

ఈవెంట్‌లో జరిగిన సంఘటనలు, రిషబ్ శెట్టి మాట్లాడిన తీరు, ఎన్టీఆర్‌తో ఉన్న స్నేహం ఇవన్నీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి. సినిమా విడుదలకు ముందే ఇలా చర్చనీయాంశంగా మారడం, చిత్రంపై క్రేజ్‌ను ఇంకా పెంచింది.

Advertisment
తాజా కథనాలు