/rtv/media/media_files/2024/12/13/7hP1Jn3nB53FVSMDZI17.jpg)
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్ ఊహించని రేంజ్‌లో నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్లుగా భారత్ - ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. తొలి టెస్టు పెర్త్‌లో జరిగింది. ఈ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల బీజీటీలో భారత్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది.
అనంతరం భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు అడిలైడ్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 157 పరుగుల లీడ్ సంపాదించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ను స్టార్ట్ చేసిన టీమిండియా పేవలమైన బ్యాటింగ్ చేసింది. ఈ రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇందులో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్ట్ సిరీస్‌లో 1-1తో సమం చేసింది.
Also Read: హైదరాబాద్ మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్ అరెస్టు
ఇక మూడో టెస్టు కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 14 నుంచి బ్రిస్బేన్‌లో గబ్బా స్టేడియం వేదికగా ఈ మూడో టెస్ట్ సిరీస్ జరగనుంది. దీనికోసం ఇరు దేశాల జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ఇక గబ్బా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా తమ జట్టును అనౌన్స్ చేసింది.
Also Read: Allu Arjun: మేము దురుసుగా ప్రవర్తించలేదు– సెంట్రల్ జోన్ డీసీపీ
ఆసీస్ జట్టులోకి స్టార్ పేసర్
తమ జట్టులోకి స్టార్ పేసర్‌ను తీసుకువచ్చింది ఆసీస్. గాయం కారణంగా గత రెండు టెస్టులకు దూరమైన జోష్ హేజిల్‌వుడ్ మళ్లీ టీంలోకి వచ్చాడు. అతడు టీంలో తిరిగి రావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా స్కాట్ బోలాండ్‌ను పక్కన పెట్టింది. ఆసీస్ టీంలో ఇదొక్కటే మార్పు జరిగింది. మిగతాదంతా యధావిధిగా ఉండనుంది. కాగా ఈ మూడో టెస్టు రేపు అనగా డిసెంబర్ 14న జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. డిసెంబర్ 14 ఉదయం 5:30 గంటలకు షురూ కానుంది.
Star Sports poster for the 3rd test between india vs Australia.
— TEJASH 🚩 (@LoyleRohitFan) December 13, 2024
Test Cricket in the early morning and winter is a different beast. 🥶💥 pic.twitter.com/GKgVAsrPG9
Also Read : Kolkata: ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు బెయిల్
మూడో టెస్టుకు ఆసీస్ టీం
నాథన్ మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, మిచ్ స్టార్క్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), నాథన్ లియోన్, మిచ్ మార్ష్, జోష్ హాజిల్‌వుడ్.
నాథన్ మెక్‌స్వీ, ఉస్మాన్ ఖవాజా ఓపెనర్లుగా రానున్నారు. మార్నస్ లాబుషాగ్నే ఫస్ట్ డౌన్‌లో.. స్టీవ్ స్మిత్ సెకండ్ డౌన్‌లో రానున్నారు. ఇక మూడో డౌన్‌లో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌కి రానున్నారు. ఆసీస్ జట్టులో ఏకైక స్పిన్నర్ నాథన్ లయన్ ఉన్నాడు.
Also Read: అల్లు అర్జున్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ మంజూరు