Kolkata: ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు బెయిల్

కోలకత్తా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్గర్ రేప్, హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తో పాటూ పాటు స్థానిక తలాపోలీస్ స్టేషన్ మాజీ అధికారి అభిజిత్ మోండల్‌కి సీల్దా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

author-image
By Manogna alamuru
New Update
RG Kar Ex Principal

కోలకత్తా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. దీని విషయంలో చాలా నెలలే ఆందోళనలు చెలరేగాయి. జూనియర్ డాక్టర్లు తమకు భద్రత లేదంటూ విధుల్లోకి వెళ్ళడానికి నిరాకరించారు. ఈ కేసు విషయంలో సంజయ్ ప్రధాన నిందితుడుగా ఉండగా కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అభిజిత్ మోండల్ జాప్యం చేశారని, ఆర్జీకర్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు వెస్ట్ బెంగాల్ పోలీసుల నుంచి ఈ కేసును సీబీఐకి ట్రాన్‌ఫర్ అయింది. సీబీఐ వీరిద్దరిని అరెస్ట్ చేసింది.

Also Read :  ఎల్లో డ్రెస్ లో సెగలు పుట్టిస్తున్న శ్రద్దా అందాలు.. చూస్తే అంతే!

Also Read :  ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రీడ్ మోడల్‌కు ఓకే–ఐసీసీ

రెండు కేసుల్లో..

అయితే ఇప్పుడు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ , సీల్దా కోర్టు సందీప్ ఘోష్‌తో పాటూ అభిజిత్ మోండల్‌కి కూడా బెయిల్ దాఖలు చేసింది. ఇద్దరు నిందితులపై చార్జిషీట్ తప్పనిసరిగా 90 రోజుల వ్యవధిలో దాఖలు చేయనందుకే నిందితులకు బెయిల్ మంజూరు చేసినట్లు కోర్టు చెప్పింది. అయితే బెయిల్ లభించినప్పటికీ సందీప్ ఘోష్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. సందీప్ ఘోష్ మీద రెండు కేసులు నడుస్తున్నాయి. అందులో ఒకటి హత్యాచారం సాక్ష్యాలను తారుమారు చేయడం అయితే..మరొకటి  ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలు మరొకటి. ఇప్పుడు హత్యాచారం కేసులో బెయిల్ వచ్చినా...ఆర్ధిక అవకతవకలు కేసులో మాత్రం సందీప్ ఘోష్ జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండాల్సిందే. దీంతో పోలీస్ ఆఫీసర్ అభిజిత్ మొండల్ మాత్రమే బెయిల్ వచ్చిన తర్వాత రిలీజ్ అవుతున్నారు. 

Also Read: Allu Arjun: మేము దురుసుగా ప్రవర్తించలేదు– సెంట్రల్ జోన్ డీసీపీ

Also Read: Varma: దేవుళ్ళను అరెస్ట్ చేస్తారా..అధికారులకు రాంగోపాలవర్మ ప్రశ్న

Advertisment
తాజా కథనాలు