Champions Trophy: వాహ్ ఏమాడారు...352 ను అలవోగ్గా బాదేసిన కంగారూలు

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అదరగొట్టింది. 352 టార్గెట్ ను ఉఫ్ అని ఊదేసింది. ఇంగ్లాండ్ పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. జోష్ ఇంగ్లిస్ 120 పరుగులతో దడదడలాడించాడు.  అలెక్స్ కేరీ 69, మాథ్యూ షార్ట్ 63 అర్ధ శతకాలు బాదారు.

New Update
cric

Australia Vs England

ఛాంపియన్స్ ట్రోఫీలో ఈరోజు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో కంగారూలు అద్భుత విజయాన్ని సాధించారు. ఇంగ్లీషు జట్టు ఇచ్చిన 351 లక్ష్యాన్ని అలవోగ్గా కొట్టేసి తమను ఢీకొట్టేవారు ఎవరూ లేరని నిరూపించకున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 351 పరులు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోరు.  అయితే ఈ కొండంత లక్ష్యాన్ని కంగారూలు 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకా 15 బంతులు మిగిలుండగానే ఛేదించారు. ఆసీస్ బ్యాటర్లు సమిష్టి రాణించారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జోష్‌ ఇంగ్లిస్ 86 బంతుల్లో 120 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  అలెక్స్ కేరీ (69), మాథ్యూ షార్ట్ (63) అర్ధ శతకాలు బాదారు. లబుషేన్ (47) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. 

ఆడుతూ పాడుతూ కొట్టేశాడు..

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదట వరుసగా వికెట్లను కోల్పోయింది. 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కానీ తరువాత వచ్చిన షార్ట్, లబుషేన్ వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడారు. వీరు కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. తరువాత వచ్చిన ఇంగ్లిస్, కేరీ మాత్రం జట్టును విజయం దిశగా నడిపించారు. భారీ స్కోరును కూడా ఇంగ్లిస్ ఆడుతూ పాడూతూ కొట్టేశాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా 15 బంతుల్లో 32 పరుగులతో దూకుడుగా ఆడాడు. 

ఇక మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ బెన్ డకెట్ 143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్ లతో 165 పరుగులు చేశాడు. తరువాత జో రూట్ 78 బంతుల్లో 68 పరుగులతో రాణించాడు. ఫిల్ సాల్ట్ 10, జేమీ స్మిత్ 15 త్వరగానే పెవిలియన్‌ చేరడంతో ఇంగ్లాండ్ 43 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రూట్‌తో కలిసి డకెట్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 158 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 95 బంతుల్లో శతకం బాదిన డకెట్.. మరో 39 బంతుల్లో 150 పరుగుల మార్కు అందుకున్నాడు. తరువాత జోస్ బట్లర్ 23, లివింగ్‌స్టన్ 14 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో డ్వారిషూస్‌ 3, ఆడమ్ జంపా 2, లబుషేన్ 2, మ్యాక్స్‌వెల్ ఒక వికెట్ పడగొట్టారు.

Also Read: AP: మిర్చి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు