/rtv/media/media_files/2025/08/16/cricket-2025-08-16-11-29-21.jpg)
BIG BREAKING: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్, కోచ్ బాబ్ సింప్సన్ తన 89 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. సింప్సన్ ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఆటగాడిగా, కెప్టెన్‌గా, కోచ్‌గా దశాబ్దాల పాటు తన సేవలను అందించారు. సింప్సన్ ఆస్ట్రేలియా తరఫున 62 టెస్ట్ మ్యాచ్‌లలో, 4,869 పరుగులు చేయగా ఇందులో 10 సెంచరీలు కూడా ఉన్నాయి. అలాగే 71 వికెట్లు కూడా తీశారు. 1964లో ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్ట్‌లో 311 పరుగులు చేసి ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏడుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఆయన ఒకరు. 13 గంటలకు పైగా బ్యాటింగ్ చేసిన సింప్సన్, తన మొదటి సెంచరీని భారీ టెస్ట్ ట్రిపుల్ సెంచరీగా (311) మార్చాడు. ట్రిపుల్ సెంచరీ నమోదు చేసిన తొలి టెస్ట్ కెప్టెన్ సింప్సన్. టెస్టుల్లో 300 పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా సింప్సన్ రికార్డు దాదాపుగా 61 సంవత్సరాలకు పైగా కొనసాగింది.
Also Read:Jharkhand : బాత్రూంలో జారిపడి జార్ఖండ్ విద్యా శాఖ మంత్రి కన్నుమూత!
Legendary player, captain, coach. Rest in Peace, Bob Simpson. 🙏
— CricBlog ✍ (@cric_blog) August 16, 2025
4,869 Test runs for Australia at 46.81, including 3,623 at 54.07 as captain.
21,029 runs and 349 wickets in First Class cricket as well. pic.twitter.com/z9UeWD8aWQ
ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఒక స్వర్ణయుగం
బాబ్ సింప్సన్ 39 టెస్టులకు ఆస్ట్రేలియా కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇందులో ఆస్ట్రేలియా 12 మ్యాచ్ లలో గెలిచింది. 41 సంవత్సరాల వయసులో తిరిగి క్రికెట్‌లోకి వచ్చి, అండర్‌మ్యాన్డ్‌గా ఉన్న ఆస్ట్రేలియా జట్టును నడిపించారు. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత, ఆస్ట్రేలియా క్రికెట్‌కు మొదటి ఫుల్-టైమ్ కోచ్‌గా బాబ్ సింప్సన్ పనిచేశారు. ఆయన కోచింగ్లోనే ఆస్ట్రేలియా 1987లో మొదటిసారి ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఆయన కోచింగ్‌లో ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఒక స్వర్ణయుగం మొదలైందని చెప్పాలి. ఆయన మరణం ఆస్ట్రేలియా క్రికెట్‌కు, ప్రపంచ క్రికెట్‌కు తీరని లోటని క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ సోషల్ మీడియాలో సింప్సన్‌కు నివాళి అర్పించారు.
Also Read:"50 ఏళ్ల లెజెండరీ జర్నీకి హాట్స్ ఆఫ్..!" మోడీ, చంద్రబాబు విషెస్ కు తలైవర్ రిప్లై ఇదే..