Asia cup 2025: దెబ్బకు దిగివచ్చిన పాక్.. బీసీసీఐకు సారీ చెప్పిన నఖ్వీ

పీసీబీ ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ దిగొచ్చాడు. ఆసియా కప్ 2025 వివాదంలో బీసీసీఐకు క్షమాపణలు తెలియజేశాడు. ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి టీమిండియా నిరాకరించడంతో అతని దగ్గరే ట్రోఫ్రీ ఉంది.

New Update
Mohsin Naqvi

Mohsin Naqvi

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ దిగొచ్చాడు. ఆసియా కప్ 2025 వివాదంలో బీసీసీఐకు క్షమాపణలు తెలియజేశాడు. ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్తాన్‌పై భారత జట్టు గెలిచింది. ఈ క్రమంలో ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. అప్పటికే నఖ్వీ ఒక అరగంట పాటు వెయిట్ చేసిన భారత ఆటగాళ్లు వెళ్లలేదు. దీంతో ట్రోఫీ లేకుండానే టీమిండియా ఆటగాళ్లు విన్నింగ్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా ఆటగాళ్లు వెళ్లకపోవడంతో.. అతను దాన్ని తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆసియా కప్ 2025 ట్రోఫ్రీ నఖ్వీ దగ్గర ఉంది. ఈ క్రమంలోనే తాను క్షమాపణ వెల్లడించాడు. అయితే ట్రోఫీని మాత్రం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏసీసీ ఆఫీస్‌కు వస్తేనే ఇస్తానని తెలిపారు. ఇప్పటికే బీసీసీఐ పలుమార్లు అడిగింది.. కానీ ట్రోఫీ ఇవ్వడానికి నఖ్వీ నిరాకరించాడు. ట్రోఫీ ఏం మీది కాదని, ఇవ్వాలని డిమాండ్ చేసిన నఖ్వీ ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే  బీసీసీఐకు నఖ్వీ క్షమాపణలు చెప్పారు. 

ఇది కూడా చూడండి: BCCI: ఆసియాకప్ ట్రోఫీ కోసం BCCI బిగ్ ప్లాన్.. దుబాయ్ నుంచి నేరుగా ఇండియాకు!

అసలు వివాదం ఏంటంటే?

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో టూరిస్టులపై పాకిస్తాన్ ఉగ్రదాడికి పాల్పడింది. ఈ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందారు. ఈ క్రమంలో భారత్ ఆపరేషన్ సిందూర్‌తో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే టీమిండియా పాకిస్తాన్‌ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ తీసుకోవడానికి నిరాకరించింది. ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్ విషయంలో టాస్ వేసే సమయంలో పాక్ జట్టు కెప్టెన్ సల్మాన్ ఆఘాతో ఫొటో తీసుకోలేదు, అలాగే తనకి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా పాకిస్తాన్‌ జట్టుకు టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే ఆసియా కప్ 2025 గెలిచిన భారత జట్టు ఈ విజయాన్ని జవాన్లకు అంకితం చేసింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ పాకిస్తాన్‌కు చెందడంతో తన చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికి టీమిండియా నిరాకరించింది.    

ఇది కూడా చూడండి: Asia Cup Trophy: ఏంటి నాటకాలుడుతున్నారా..నఖ్వీ, సల్మాన్ ఆఘాపై మండిపడుతున్న బీసీసీఐ

Advertisment
తాజా కథనాలు