Viral Video: పాక్‌ను చిత్తు చేసిన భారత్.. హైదరాబాద్‌లో సంబరాలు  జరుపుకున్న ఫ్యాన్స్

పాక్‌పై టీమిండియా గెలవడంతో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. దేశ వ్యాప్తంతో పాటు హైదరాబాద్‌లో సెక్రటేరియట్ దగ్గర అయితే సందడి చేశారు. టీమిండియా గెలిచిన సందర్భంగా ఫ్యాన్స్ హ్యాపీగా డ్యాన్స్‌లు వేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

New Update
asia cup

asia cup

ఆసియా కప్ 2025 టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. పాక్‌ను చిత్తు చిత్తు చేసి ఓడించింది. హోరా హోరీగా సాగిన ఈ ఆటలో భారత్ ఓటమిపాలవుతుందని అందరూ భావించారు. కానీ చివరకు టీమిండియా ప్రత్యర్థికి చెమటలు  పట్టించింది. తిలక్, కులదీప్ యాదవ్, సంజూ శాంసన్, దూబేలు మ్యాచ్‌ను గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ముఖ్యంగా తిలక్ అయితే తీవ్ర ఒత్తిడికి పాల్పడుతూ కూడా మ్యాచ్‌ను గెలిపించాడు. దాదాపు 41 ఏళ్ల తర్వాత భారత్, పాక్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది.

ఇది కూడా చూడండి: Asia Cup 2025: మా కొద్దు మీరే ఉంచుకోండి..ఆసియా కప్ ను నిరాకరించిన టీమ్ ఇండియా

రోడ్లెక్కి సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్..

పాక్‌పై టీమిండియా గెలవడంతో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. దేశ వ్యాప్తంతో పాటు హైదరాబాద్‌లో సెక్రటేరియట్ దగ్గర అయితే సందడి చేశారు. టీమిండియా గెలిచిన సందర్భంగా ఫ్యాన్స్ హ్యాపీగా డ్యాన్స్‌లు వేశారు. అర్థరాత్రి సమయంలో టీమిండియా మ్యాచ్ గెలిచిన వెంటనే ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, సెక్రటేరియట్ దగ్గరకు ఫ్యాన్స్ చేరుకున్నారు. ఎంతో సందడి చేశారు. పాక్‌ను చిత్తు చేశారని ఫ్యాన్స్ తెలిపారు. రోడ్లపై బాణా సంచా వంటివి కాల్చారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చూడండి: Team India: రోహిత్ ను ఫాలో అయిన కెప్టెన్ స్కై..సెలబ్రేషన్స్ మూమెంట్ చూశారా..

Advertisment
తాజా కథనాలు