/rtv/media/media_files/2025/09/29/asia-cup-2025-09-29-05-08-09.jpg)
41 ఏళ్ల ఆసియా కప్ టోర్నీ చరిత్రలోనే తొలిసారి ఫైనల్ లో తలపడ్డ ఇరుజట్లలో టీమ్ ఇండియా దే పైచేయి. ఫైనల్ ఇన్నింగ్స్ లో 5 వికెట్ల తేడాతో గెలిచింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 69 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ ను దగ్గరుండి గెలిపించాడు. మరుపురాని విజయాన్ని సాధించిన తర్వాత భారత్ జట్టు మాత్రం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన తొమ్మిదో ఆసియా కప్ టైటిల్ ను తీసుకోవడానికి నిరాకరించింది. పాక్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఇస్తుండడమే దీనికి కారణం. వాళ్ళకు షేక్ ఇవ్వడానికే తాము ఒప్పుకోలేదని దీనికి ఎలా ఒప్పుకుంటామంటూ ట్రోఫీ , మెడల్స్ తీసుకోకుండానే టీమ్ ఇండియా ఆటగాళ్ళు డగౌట్ కు చేరుకున్నారు.
Mohsin Naqvi was waiting for the Indian players to come on stage to collect the trophy,
— Space Recorder (@1spacerecorder) September 28, 2025
but Indian players were busy watching Instagram reels and reading Space Recorder tweets on the ground
🤣🤣pic.twitter.com/R0hZKRYeQa
వాడెవ్వడు మాకు ట్రోఫీ ఇవ్వడానికి...
పాకిస్తాన్ మంత్రి నఖ్వీ చాలా సేపు ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ భారత ఆటగాళ్ళు మాత్రం పోడియం మీదకు రాలేదు. ఫోన్లు చూస్తూ కిందనే కాలక్షేపం చేశారు. భారత్ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెసెంటేటర్ ప్రకటించారు. చివరకు నఖ్వీ ట్రోఫీని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తరువాత టీమ్ ఇండియా ఆటగాళ్ళు పోడియం దగ్గరకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. భారత్ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెసెంటేటర్ ప్రకటించారు.
India lift the Asia Cup Trophy in Dubai even though Pakistan Interior Minister Mohsin Naqvi cowardly stole it. Epic trolling of Pakistan by the Indian Cricket Team. pic.twitter.com/H0udtGSenP
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 28, 2025
🚨MOHSIN NAQVI HAS LEFT THE GROUND WITH ASIA CUP TROPHY AFTER INDIA REFUSED TO TAKE FROM HIM 🤯#INDvPAK#indvspak2025#IndianCricket#INDvsPAK#PAKvsINDpic.twitter.com/Lf61pr5XRD
— RK Azlaan FCB (@Azlaan_FCB) September 28, 2025
మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ..తమ విజయంతో దేశం మొత్తం సంబరాలఉ చేసుకుంటుందని అన్నాడు. మ్యాచ్ తరువాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ పాల్గొన్నారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో ట్రోఫీని తీసుకోకపోవడంపై సమాధానం ఇస్తూ..తన కెరీర్ లో ఒక విజేత జట్టు ట్రోఫీని నిరాకరించడం ఇదే మొదటి సారని స్కై అన్నాడు. తాము అన్ని రకాలుగా అర్హులే అయినప్పటికీ...కావాలనే తిరస్కరించామని చెప్పాడు. మిగతా ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పకుండా దాటవేశాడు.