Team India: రోహిత్ ను ఫాలో అయిన కెప్టెన్ స్కై..సెలబ్రేషన్స్ మూమెంట్ చూశారా..

టీ 20 వరల్డ్ కప్ గెలిచాక కెప్టెన్ రోహిత్ శర్మ సెలబ్రేషన్స్  అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే మూమెంట్ ను కెప్టెన్ స్కై ఫాలో అయ్యాడు. అచ్చు రోహిత్ లానే చేస్తూ వైరల్ అయ్యాడు. 

New Update
celebrations

ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియా అద్భుత విజయాన్ని సాధించారు. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ మట్టి కరిపించారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్ తో మ్యాచ్ ను దగ్గరుండి గెలిపించాడు.  మ్యాచ్ గెలిచిన తరువాత ఆసియా కప్ ను తీసుకోవడానికి నిరాకరించాడు కెప్టెన్ స్కై. దాంతో పాటూ ఆటగాళ్ళు ఎవరూ కూడా మెడల్స్ తీసుకోడానికి వెళ్ళలేదు. పాకిస్తాన్ మంత్రి నఖ్వీ పోడియం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే మనవాళ్ళు మాత్రం ఫోన్లు చూసుకుంటూ గడిపారు. ఇండియా ప్లేయర్ల కోసం ఎదురు చూసి చూసి చివరకు నఖ్వీ కప్ పట్టుకుని వెళ్ళిపోయారు. ప్రసెంటేటర్ భారత్ కప్పును తిరస్కరించారు అంటూ అనౌన్స్ చేశారు. 

టీమ్ ఇండియా సూపర్ సెలబ్రేషన్స్..

అయితే పోడియం నుంచి పాకిస్తాన్ మంత్రి వెళ్ళిపోగానే మనవాళ్ళు అక్కడకు వచ్చి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కప్ తీసుకోకపోయినా...విజయాన్ని మాత్రం ఆస్వాదిస్తామంటూ సంబరాలు చేసుకున్నారు. ఆనందంతో గెంతులు వేశారు. దాంతో పాటూ టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ సభ్యులు ఎలా అయితే విన్నింగ్ సెలబ్రేషన్స్ ను చేసుకున్నారో...అచ్చు అలానే ఇప్పుడు కెప్టెన్ సూర్య కుమార్ కూడా తన టీమ్ మెంబర్స్ తో ఆనందం పంచుకున్నాడు. కప్ పట్టుకుని నడుచుకుని వస్తున్నట్టు చేశాడు. రోహిత్ లానే బేర్ లాగ నడుచుకుంటూ వచ్చాడు.   

Advertisment
తాజా కథనాలు