/rtv/media/media_files/2025/07/26/asia-cup-2025-schedule-start-date-fixed-2025-07-26-18-14-51.jpg)
Asia Cup 2025 Schedule, Start Date Fixed
పురుషుల 2025 ఆసియా కప్ (2025 Asia Cup) సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యూఏఈలో (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో) జరగనుంది. ఇదే విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛీఫ్ మోహ్సిన్ నఖ్వీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Also Read:ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన
2025 Asia Cup
ఈ 2025 Asia Cup ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జులై 24న ఢాకాలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిని తాజాగా ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది. కాగా ఇక్కడ ముఖ్యమైన మరో విషయం ఏంటంటే.. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉండే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారిక హోస్ట్‌గా ఉన్నప్పటికీ, మ్యాచ్‌లు UAEలో జరుగుతాయి.
Also Read:TRFను ఉగ్ర సంస్థగా ప్రకటించుకోండి.. పాక్ సంచలన వ్యాఖ్యలు
ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. అందులో భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, UAE, హాంకాంగ్, ఒమన్ వంటి దేశాలు ఉన్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు ఆడనుండగా.. ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది. ఫిబ్రవరి 2026లో భారతదేశం, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న ICC T20 ప్రపంచ కప్‌కు ముందు సన్నాహక టోర్నమెంట్‌గా ఇది ఉపయోగపడుతుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2023లో టైటిల్‌ను గెలుచుకున్న భారతదేశం ప్రస్తుతం ఆసియా కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది.
Also Read:18 ఏళ్లకే పైలట్.. సమైరా సక్సెస్ స్టోరీ ఇదే.. మీ పిల్లలకు తప్పక వినిపించండి!
/filters:format(webp)/rtv/media/media_files/2025/07/26/asia-cup-2025-schedule-2025-07-26-18-21-44.jpeg)