/rtv/media/media_files/2025/07/26/asia-cup-2025-schedule-start-date-fixed-2025-07-26-18-14-51.jpg)
Asia Cup 2025
సెప్టెంబర్ 9వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న ఆసియా కప్ షెడ్యూల్‌లో కీలక మార్పులు చేసింది. మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాలి. అయితే ఈ సమయాన్ని మారుస్తూ రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు ఆడుతున్నాయి. ఫైనల్‌తో పాటు మొత్తం 18 మ్యాచ్‌లు ఇందులో జరగనున్నాయి. అన్ని మ్యాచ్‌ల టైమింగ్స్‌ను కూడా ఏసీసీ మార్చేసింది. అలాగే సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన మ్యాచ్‌లను 5:30 నిమిషాలకు ప్రారంభం అవుతాయని తెలిపింది. ఎందుకంటే ప్రస్తుతం దుబాయ్‌లో విపరీతంగా ఎండలు ఉన్నాయి. భారీ ఉక్కపోత కారణంగా ఆటగాళ్ల రక్షణ కోసం ఈ మ్యాచ్‌ల సమయాన్ని ఏసీసీ కుదించినట్లు తెలుస్తోంది. ఆసియా కప్ 2025 మొదటి మ్యాచ్ అప్గానిస్థాన్, హాంగ్ కాంగ్ మధ్య జరగనుంది. సెప్టెంబర్ 10న టీమిండియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో తలపడనుంది. దాయాది దేశం పాకిస్తాన్‌తో సెప్టెంబర్ 14వ తేదీన ఢీకొట్టనుంది.
ఇది కూడా చూడండి: RCB: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటన.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు!
❗️ Big Breaking News ❗️
— Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) August 30, 2025
Asia Cup 2025 Matches Timings Changed.
Match Will Now Start 6:30 PM Local And 8 PM Indian Time, Because Of Extremely Warm Conditions In UAE. pic.twitter.com/lidWpWU6h6
ఆసియా కప్‌కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), సంజు శాంసన్ (వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.
ఆసియా కప్ 2025 షెడ్యూల్
సెప్టెంబర్ 9న - ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్
సెప్టెంబర్ 10న - భారతదేశం vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
సెప్టెంబర్ 11న బంగ్లాదేశ్ vs హాంకాంగ్
సెప్టెంబర్ 12న - పాకిస్తాన్ vs ఒమన్
సెప్టెంబర్ 13న - బంగ్లాదేశ్ vs శ్రీలంక
సెప్టెంబర్ 14న - భారతదేశం vs పాకిస్తాన్
సెప్టెంబర్ 15న - యూఏఈ vs ఒమన్
సెప్టెంబర్ 15న శ్రీలంక vs హాంకాంగ్
సెప్టెంబర్ 16న -బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్
సెప్టెంబర్ 17న- పాకిస్తాన్ vs యూఏఈ
సెప్టెంబర్ 18న - శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్
సెప్టెంబర్ 19న - భారతదేశం vs ఒమన్
సెప్టెంబర్ 20 - B1 vs B2,
సెప్టెంబర్ 21న - A1 vs A2
సెప్టెంబర్ 22న - విశ్రాంతి దినం
సెప్టెంబర్ 23న - A2 vs B1
సెప్టెంబర్ 24న - A1 vs B2
సెప్టెంబర్ 25న - A2 vs B2
సెప్టెంబర్ 26న - A1 vs B1
సెప్టెంబర్ 27న - విశ్రాంతి దినం
సెప్టెంబర్ 28న - ఫైనల్, దుబాయ్ - రాత్రి 8 గంటలు
సెప్టెంబర్ 29న - రిజర్వ్ డే
ఇది కూడా చూడండి: MS Dhoni : ధోనీకి BCCI బంపర్ ఆఫర్..! మరి గంభీర్ ఒప్పుకుంటాడా ?