Asia Cup 2025: బోణీ కొట్టిన పాక్.. భారత్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తామంటూ సవాల్ విసిరిన పాకిస్తాన్

ఆసియా కప్ టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 14న భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా భారత్‌కు సవాల్ విసిరారు. గత రెండు నెలల నుంచి తమ జట్టు అద్భుతమైన ప్రదర్శన ఇస్తుందని, భారత్‌ను ఓడిస్తుందని అన్నారు.

New Update
Pak

Pak

ఆసియా కప్ టోర్నీలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా భారత్‌కు సవాల్ విసిరారు. ప్రస్తుతం తమ జట్టు బ్యాటింగ్‌లో బాగానే ఆడుతుందని, ఇంకా మెరుగుపడాల్సి ఉందని అన్నారు. అయితే సెప్టెంబర్ 14వ తేదీన భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో జరిగిన తర్వాత సల్మాన్ అలీ మాట్లాడారు. బ్యాటింగ్‌లో ఇంకా కష్టపడాలని అన్నారు. ముఖ్యంగా టపార్డర్ వల్ల కాస్త నిరాశ పరిచిందని అన్నారు. అయితే  పాక్ జట్టు బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిందని, తక్కువ స్కోరుకే ఒమన్లను కట్టడి చేయగలిగామని అన్నారు. పాక్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని తెలిపారు. ముఖ్యంగా ముగ్గురు స్పికర్లు ఉన్నారని, అందులో ఒక్కోక్కరు ఒక్కోలా అద్భుతంగా ఆడతారని అన్నారు.

ఇది కూడా చూడండి: Asia Cup: దాంతో మాకు సంబంధం లేదు..మా దృష్టి ఆటపైనే..పాకిస్తాన్ మ్యాచ్ లపై మౌనం వీడిన భారత్

భారత్  జట్టుపై ఈజీగా మ్యాచ్ గెలుస్తామని..

బౌలింగ్‌లో తమకు మంచి ఆప్షన్స్ ఉన్నాయని, అవే తమకు బలం అని సల్మాన్ అలీ తెలిపారు. యూఏఈ వంటి పిచ్‌లో ఎక్కువగా స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. అలాగే ఎన్ని పరుగులు చేయగలమని చెప్పడం కష్టం. క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందనే విషయం చెప్పలేమన్నారు. సెప్టెంబర్ 14వ తేదీన భారత్‌తో జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడుతూ సవాల్ విసిరారు. గత రెండు నెలల నుంచి తమ జట్టు బాగా క్రికెట్ ఆడుతుందని అన్నారు. సరిగ్గా ప్రణాళికలను అమలు చేస్తే అన్ని జట్లును కూడా ఓడించగలమని సల్మాన్ తెలిపారు. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో బలాబలాలను నిరూపించుకోవడానికి రెడీగా ఉన్నామని వెల్లడించారు. మరి ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

ఇది కూడా చూడండి: India Vs Pakistan : అయ్యో పాపం.. 50% తగ్గించినా .. టికెట్లు కొనట్లే!

Advertisment
తాజా కథనాలు