/rtv/media/media_files/2025/09/12/india-1-2025-09-12-20-21-51.jpg)
సాధారణంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్‌లకు భారీగా డిమాండ్ ఉంటుంది. అయితే ఆసియా కప్ లో భాగంగా ఎల్లుండి అంటే సెప్టెంబర్ 14వ తేదీన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు మాత్రం ఇంకా అమ్ముడుపోలేదు. దీంతో నిర్వాహకులు టిక్కెట్ల ధరలను భారీగా తగ్గించారు. అయినప్పటికీ టికెట్ల అమ్మకాలు మందకొడిగా సాగుతుండటంతో అభిమానులందరూ ఆశ్చర్యపోతున్నారు.
గతంలో భారత్-పాక్ మ్యాచ్‌లకు టిక్కెట్లు కొద్ది గంటల్లోనే అమ్ముడయ్యేవి. కానీ ఈసారి డిమాండ్ అంతగా లేదు. పహల్గాం దాడి నేపథ్యంలో.. ఇండియా, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడకూడదని అభిమానులు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. దీంతో టికెట్ల అమ్మకాలు సన్నగిల్లాయి. అలాగే అధిక ధరలు కూడా మరో కారణంగా నిలుస్తున్నాయి.
Shockingly, nearly 50% of the tickets for India vs Pakistan in Asia Cup 2025 are still unsold! 😲🏏
— Danish Mughal 🇵🇰 (@MughalDanish50) September 12, 2025
Where’s the hype gone?#INDvsPAK#AsiaCup2025#Cricketpic.twitter.com/kS8horHbNV
సగానికి తగ్గించారు
గతంలో సుమారు రూ. 5000గా ఉన్న ధరను రూ. 2500కి తగ్గించారు. అంటే సగానికి తగ్గించారు. ఇతర కేటగిరీల ధరలను కూడా భారీగా తగ్గించారు. సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ECB) స్పందన మాత్రం భిన్నంగా ఉంది. టికెట్లు అమ్ముడు పోవడం లేదన్నది వాస్తవం కాదని ఈసీబీ ఖండిస్తోంది. ‘పరిస్థితులు చాలా ప్రోత్సాహకంగా ఉన్నాయి. టికెట్లు అమ్ముడు పోవడం లేదు అనే విషయంలో ఎలాంటి వాస్తవం లేదుని వారు అంటున్నారు.
2025లో దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరగడం ఇది రెండోసారి. ఛాంపియన్స్ ట్రోఫీలో, రెండు జట్లు గ్రూప్ మ్యాచ్ కోసం తలపడ్డాయి. నాలుగు నిమిషాల్లోనే టిక్కెట్లు అమ్ముడుపోయాయి. పాకిస్తాన్‌తో ఆసియా కప్ మ్యాచ్‌ను కొనసాగించడంపై బీసీసీఐ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. హర్భజన్ సింగ్ వంటి వారు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడే వరకు క్రికెట్ ఆడకూడదని సూచించారు.
టీం ఇండియాకు గుడ్‌న్యూస్..
గతంలో ఇంగ్లాండ్ పర్యటనలో 5 టెస్ట్ మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరిగింది. ఇందులో భాగంగా నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో రిషభ్ పంత్ కాలుకు తీవ్ర గాయం అయింది. క్రిస్ వోక్స్ వేసిన బంతిని రివర్స్ షాట్ కొట్టడానికి ప్రయత్నిస్తూ పంత్ కుడి కాలికి గాయమైంది. ఈ గాయం తర్వాత పంత్ గ్రౌండ్ నుంచి దూరమయ్యాడు. అక్కడ నుంచి రిషబ్ పంత్ ముంబై చేరుకున్నాడు. అక్కడ అతని గాయాన్ని డాక్టర్లు పరిశీలించి చికిత్స అందించారు. తాజాగా అతడి కాలు గాయానికి సంబంధించి ఓ పెద్ద అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం పంత్ కాలుకు బ్రేస్ ఉన్నట్లు తెలిసింది. అతడ్ని NCAలో పునరావాసం ప్రారంభించమని డాక్టర్లు సలహా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం పంత్ గాయం కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. త్వరలో పూర్తిగా కోలుకుని మళ్లీ మైదానంలోకి వస్తాడని అంతా భావిస్తున్నారు.