U19 Womens T20 World Cup: భారత మహిళల జట్టుపై చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రశంసల వర్షం..!

అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలవడంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయంతో ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునేలా ఆడారన్నారు. అంతేకాకుండా మహిళా క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చారని అన్నారు.

New Update
AP CM Chandrababu Naidu and Pawan Kalyan praise on Indian Women's Under-19 team after winning T20 World Cup

AP CM Chandrababu Naidu and Pawan Kalyan praise on Indian Women's Under-19 team after winning T20 World Cup

మహిళల అండర్ 19 టీ20 వరల్డ్‌ కప్‌ విజేతగా భారత్ నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంపై పలువురు క్రికెట్, సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారత్ మహిళల జట్టుకు అభినందనలు తెలిపారు. 

దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది

ఈ మేరకు సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా పోస్టు పెట్టారు. ‘‘T20 ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల U-19 జట్టుకు అభినందనలు! మీ కృషి, దృఢ సంకల్పం, ధైర్యసాహసాలతో.. మీరు దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశారు. మీరు దేశానికి కీర్తిని తెచ్చిపెట్టడమే కాకుండా, లెక్కలేనన్ని యువతులకు కూడా స్ఫూర్తినిచ్చారు! మొత్తం దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది!’’ అని పోస్టులో రాసుకొచ్చారు. 

Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

పవన్ కళ్యాణ్ ట్వీట్

అలాగే డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ‘‘మలేసియాలో జరిగిన ఐసీసీ అండర్-19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌లో విజయం సాధించిన అండర్ 19 భారత మహిళా క్రికెట్ జట్టుకి‌ శుభాకాంక్షలు. వారి అంకితభావం, వారు సాధించిన విజయం దేశ మహిళలకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది. ఈ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబర్చిన గొంగడి త్రిషకు ప్రత్యేక అభినందనలు. భారత జట్టులోని ప్రతీ ఒక్కరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ రాసుకొచ్చారు. 

Also Read : జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే... సీబీఐ స్పెషల్‌ కోర్టు తీర్పు!

భారత జట్టుకు అభినందనలు

మరోవైపు మంత్రి నారా లోకేష్ సైతం భారత క్రికెట్ జట్టుపై ప్రశంసలు కురిపించారు. ‘‘డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టి రెండోసారి మహిళల అండర్-19 టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు. సమిష్టి ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించి అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. టోర్నీ మొత్తం తనదైన బ్యాటింగ్, బౌలింగ్ తో అద్భుత ప్రదర్శన చేసిన తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష అందరికీ గర్వకారణంగా నిలిచారు. భారత మహిళల జట్టు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని అన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు