/rtv/media/media_files/2025/12/17/aman-rao-perala-from-karimnagar-selected-for-ipl-2025-12-17-18-47-39.jpg)
aman rao perala from karimnagar selected for IPl
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేసవి కాలం వచ్చిందంటే కోట్లాదిమంది క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ చూసేందుకు టీవీలు, ఫోన్‌లకు అతుక్కుపోతారు. 2026 ఐపీఎల్‌కు సంబంధించి అబుదాబి వేదికగా మంగళవారం మినీ వేలం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన అమన్‌రావు కూడా ఐపీఎల్‌కు సెలెక్ట్ అయ్యారు. రాజస్థాన్ రాయల్స్ టీమ్ అతడిని రూ.30 లక్షలకు దక్కించుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పేరాల అమన్‌రావు (21) స్వస్థలం కరీనంగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామం. అతడు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అండర్ 19, అండర్ 23లో బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అండర్-23 ముస్తాక్ అలీ క్రికేట్ టోర్నమెంట్‌లో 160 స్ట్రైక్ రేట్‌తో.. 250 పైగా స్కోర్ సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం అమన్‌రావు హైదరబాద్ టీమ్ తరఫున అండర్-23 విభాగంలో రంజీ క్రికెట్ టోర్నీలో మ్యాచ్‌లు ఆడుతున్నాడు. మొదటిసారిగా కరీంనగర్ జిల్లాకు చెందిన యువకుడు ఐపీఎల్‌కు సెలెక్ట్ కావడంపై స్థానికులు, రాజకీయ నేతలు అమన్‌రావును అభినందిస్తున్నారు.
Also Read: JIO కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. ఫ్రీగా రూ.35 వేల బెనిఫిట్స్!
ఇక అమన్‌రావు తండ్రి మధుసూదన్‌రావు కరీంనగర్ హిందూ క్రికెట్ టీమ్‌లో సభ్యుడిగా కొన్నేళ్లకింద జిల్లా స్థాయిలో క్రికెట్ ఆడారు. అయితే ఐపీఎల్ మినీ వేలంలో పాల్గొనేందుకు అమన్‌రావుకు పాస్‌పోర్టు లేదు. దీంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి ఈ విషయం చెప్పడంతో ఆయన వెంటనే స్పందించి ఒక్కరోజులోనే పాస్‌పోర్టు ఇప్పించి వేలంలో పాల్గొనేలా చేశారని అమన్ రావు తండ్రి తెలిపారు.
ఇదిలాఉండగా ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కెమెరాన్ గ్రీన్ రికార్డు స్థాయిలో రూ.25.20 కోట్లకు అమ్ముడుపోయాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ అతడిని దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ప్లేయర్‌గా కామెరూన్ గ్రీన్ రికార్డు సృష్టించాడు.
Also Read: మా నాన్నను జైల్లో చిత్రహింసలు పెడుతున్నారు.. ఇమ్రాన్ ఖాన్ కొడుకులు తీవ్ర ఆవేదన
Follow Us