RCB Advertisement: ఆర్సీబీ కలను నిజం చేసిన యాడ్

ఈసారి ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలుస్తుందని ముందే గెస్ చేశారు. అందుకు తగ్గట్టుగా యాడ్స్ కూడా చేశారు. ఐపీఎల్ స్టార్ట్ అవ్వక ముందు ప్రసారం చేసిన ఓ యాడ్ ఇప్పుడు ఆర్సీబీ గెలిచాక మళ్ళీ పాపులర్ అవుతోంది.

New Update
ipl

RCB Advertisement

RCB Advertisement: ఈ సాలా కప్ నమ్దే... ఈ స్లోగన్ గత పద్దెనిమిదేళ్ళ నుంచి వినిపిస్తూనే ఉంది అయితే ఈసారి మరింత ఎక్కువగా వినిపించింది. ఎన్నో ఏళ్ళ కలగా మిగిలిపోయిన కప్ బెంగళూరుకు రావాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అందుకు తగ్గట్టుగా యాడ్స్ కూడా రూపొందించారు. ముఖ్యంగా స్టార్ బ్యటార్ విరాట్ కోహ్లీ కోసం ఈ సీజన్ ఐపీఎల్ టైటిల్ ఆర్సీబీ కి రావాలని అందరూ గట్టిగా ప్రార్ధించారు. అందరి ప్రార్థనలను, కలలను నిజం చూస్తూ ఐపీఎల్ సీజన్ 18 విజేతగా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అవతరించింది. 

Also Read:ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు

మళ్ళీ పాపులర్ అయిన యాడ్..

ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు బోలెడు యాడ్ మనకు కనిపిస్తాయి. ప్రతీ టీమ్ కు కనీసం ఓ పది యాడ్స్ అయినా పడతాయి. టీమ్ వైజ్ గా...ప్రతీ ఆటగాడికీ కూడా యాడ్స్ ఉంటాయి. అలాగే ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నట్టుగా యాడ్స్ చిత్రీకరిస్తారు. ఐపీఎల్ స్టార్ట్ అవ్వక రెండు నెలల ముందు నుంచి టీవీల్లో, ఫ్లెక్సీల్లో...ఎక్కడిపడితే అక్కడ అడ్వర్టైజ్ మెంట్లతో హోరెత్తిస్తారు. అలా అప్పుడు రూపొందించిన యాడ్ ఒకటి ఇప్పుడు మళ్ళీ పాపులర్ అవుతోంది ఆర్సీబీ కలను నిజం చేసిన యాడ్ అంటూ నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

Also Read:ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్

ఐపీఎల్ లో ఇది పద్దెనిమిదవ సీజన్. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ కూడా 18. అందుకే ఈసారి కప్ బెంగళూరుదే అని అందరూ మొదట నుంచి చెప్పిన మాట. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ తో యాడ్ కూడా వచ్చింది. ఇందులో స్వయంగా విరాట్ కోహ్లీనే నటించాడు కూడా. ఇందులో 18 అంకెను చూపిస్తూ ఐపీఎల్ కప్ బెంగళూరుదే అన్నట్టు చిత్రీకరించారు. ఎలా చూసినా 18 దే వస్తోంది అన్నట్టు చూపించారు. ఇప్పుడు అదే నిజమై ఆర్సీబీ కప్ గెలిచింది. అందుకే ఈ యాడ్ మళ్ళీ ఇప్పుడు పాపులర్ అయింది. 

Also Read: బెంగళూరు కోసమే నేనున్నా...విరాట్

Also Read: IPL 2025: ఐపీఎల్ లో ఆర్సీబీకి దక్కిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Advertisment
తాజా కథనాలు