Lokesh Yuvagalam : వైసీపీ(YCP) ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు.. ఆంద్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీని తిరిగి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Lokesh) యువగళం పేరుతో పాదయాత్ర(Yuva Galam Padayatra) చేపట్టిన విషయం తెలిసిందే. . జనవరి 27న కుప్పంలో(Kuppam) ప్రారంభమైన యువగళం పాదయాత్ర పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా సాగింది. ఇటీవల రెండో దశ పాదయాత్ర ప్రారంభించారు లోకేష్. ఇటీవల యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్న విషయం తెలిసిందే.
ALSO READ: పెన్షన్ రూ.3,000కు పెంపు…రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
తాజాగా ఈ నెల 20వ తేదీన లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగియనుంది. ఈ నేపథ్యంలో విజయనగరంలో ముగింపు సభ ఏర్పాటు చేయనున్నారు టీడీపీ నేతలు. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి టీడీపీ కార్యకర్తలు తరలి వచ్చేలా టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 19న వివిధ ప్రాంతాల నుంచి విజయనగరం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు టీడీపీ నాయకులు. చిత్తూరు, తిరుపతి నుంచి ప్రత్యేక రైళ్లు బయల్దేరనున్నాయి. రైల్వే కోడూరు, అనంతపురం నుంచి ఏడు ప్రత్యేక రైళ్లు బయల్దేరనున్నాయి. ఒక్కో రైలులో 1300 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా ఆర్టీసీ నుంచి అద్దెకు ప్రత్యేక బస్సుల కోసం అధికారులకు టీడీపీ నేత అచ్చెన్నాయుడు(Atchannaidu) లేఖ రాశారు. యువగళం జైత్రయాత్ర సభకు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ(Balakrishna) తదితర ముఖ్య నేతలు హాజరు కానున్నారు.
ALSO READ: ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ సాబ్జీ మృతి పట్ల లోకేష్ దిగ్భ్రాంతి
ఎమ్మెల్సీ సాబ్జీ మృతి పట్ల నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాసనమండలిలో వినిపించే ప్రజల గొంతు మూగబోయిందని అన్నారు. టీచర్ల హక్కుల పోరాటయోధుడు సాబ్జీకి నివాళులర్పిస్తున్నా అని పేర్కొన్నారు. సాబ్జీ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని అన్నారు.