TDP Lokesh : యువగళం ముగింపు సభకు ప్రత్యేక రైళ్లు
లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరంలో ఏర్పాటు చేయనున్నారు టీడీపీ నేతలు. ఈ సభ కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఈ సభకు హాజరు కానున్నారు.
లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ విజయనగరంలో ఏర్పాటు చేయనున్నారు టీడీపీ నేతలు. ఈ సభ కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఈ సభకు హాజరు కానున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో మైలురాయిని అందుకుంది. యువగళం పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట వద్ద 3,000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది.
సీఎం జగన్ పై యువగళం పాదయాత్రలో విమర్శలు గుప్పించారు లోకేష్. చంద్రబాబు, పవన్ కలవకూడదని జగన్ విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. 2024లో టీడీపీ -జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీపై సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ భారత్. టీడీపీ పవన్ కళ్యాణ్ ను నమ్ముకుందని అన్నారు. లోకేష్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. జగన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ నేత లోకేష్ చేపట్టిన యువగళం రెండో విడత పాదయాత్రపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ నెల 27 నుంచి యువగళం రెండో విడత పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు.
యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసు నేపధ్యంలో యువగళం పాదయాత్ర తేదీని మార్చినట్లుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణ ఉన్నందున యువగళం పాదయాత్రను వాయిదా వేసారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 8.25గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభం అవ్వాల్సి ఉంది. ఈ తరుణంలో పాదయాత్ర మరోవారం రోజుల పాటు వాయిదా వేయాలని టీడీపీ నేతలు కోరినట్లు సమాచారం. వచ్చేనెల 3వ తేదీ నుంచి యువగళం పాదయాత్ర చేట్టాలని కోరారని తెలుస్తోంది. ఒకవేళ లోకేశ్ ను అరెస్టు చేస్తే...బ్రాహ్మణి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ పాదయాత్ర గురించి బ్రాహ్మణికి కుటుంబ సభ్యులు అన్ని విషయాలను వివరించారట.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజల్లో తిరుగుతున్నారు. పాదయాత్రలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే పనితీరును ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.
గన్నవరం యువగళం సభలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసులు నమోదుచేడయంపై యువనేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాకంటక పాలకులని ప్రశ్నించే బాధ్యతని ప్రతిపక్ష టీడీపీ నిర్వర్తించడం నేరం ఎలా అవుతుందో అని ప్రశ్నించారు.