Banks: పలు బ్యాంకుల్లో మే నుంచి కొత్త రూల్స్.. కొన్ని బ్యాంకుల్లో మే నెలలో నియమాలు మారబోతున్నాయి. యస్ బ్యాంక్ (Yes Bank) అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం.. మే 1వ తేదీ నుంచి వివిధ రకాల పొదుపు అకౌంట్ల కనీస సగటు నిల్వ మారనుంది. ICICI , HDFC బ్యాంకుల్లో కూడా పలు మార్పులు రానున్నాయి. By B Aravind 27 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మరో నాలుగు రోజుల్లో మే నెల రాబోతుంది. ప్రతినెల లాగే మే నెల ప్రారంభం నుంచి కొత్త ఆర్థిక నియమాలు మారనున్నాయి. అయితే కొన్ని బ్యాంకుల్లో మే నెలలో నియమాలు మారబోతున్నాయి. అవేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. యస్ బ్యాంక్ (Yes Bank) అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం.. మే 1వ తేదీ నుంచి వివిధ రకాల పొదుపు అకౌంట్ల కనీస సగటు నిల్వ మారనుంది. యస్ బ్యాంక్ ప్రో మాక్స్ మినిమమ్ యావరేజ్ బ్యాలెన్స్.. రూ.50 వేలుగా మారబోతుంది. దీనిపై గరిష్ఠ రుసుము రూ.1000గా నిర్ణయించారు. ప్రో ప్లస్ పొదుపు ఖాతాలలో కనీస సగటు నిల్వ పరిమితిని రూ.25 వేలుగా సవరించారు. ఈ అకౌంట్కు గరిష్ఠ రుసుమును రూ.750గా నిర్ణయించారు. అలాగే బ్యాంక్ అకౌంట్ ప్రోలో కనీస నిల్వ రూ.10 వేలు, దీనిపై గరిష్ఠ రుసుము రూ.750గా మారింది. Also Read: వైసీపీ మేనిఫెస్టో “నవరత్నాలు ప్లస్ ” విడుదల.. ఈ అంశాలపై జగన్ స్పెషల్ ఫోకస్..! ICICI బ్యాంక్ చెక్ బుక్, ఐఎంపీఎస్, ఈసీఎస్ / ఎన్ఏసీహెచ్ డెబిట్ రిటర్న్స్, స్టాప్ పేమెంట్ ఛార్జీలతో సహా మరికొన్ని సేవల సేవింగ్స్ ఖాతా సర్వీసు ఛార్జీలను మార్చింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం చూసుకుంటే.. మే1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. డెబిట్ కార్డ్ వార్షిక రుసుములు ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో రూ.99 పట్టణ ప్రాంతాల్లో రూ.200 ఉండనున్నాయి. ఇక చెక్బుక్లో 25 లీఫ్స్ వరకు ఎలాంటి ఛార్జ్ ఉండదు. ఆపైన ఒక్క చెక్ లిఫ్కు రూ.4 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. డీడీ క్యాన్సిలేషన్, డూప్లికేట్, రీవ్యాలిడేషన్కు ఛార్జీలను రూ.100లుగా బ్యాంకు మార్పులు చేసింది. ఇక అతిపెద్ద ప్రైవేట్ రంగం బ్యాంక్ అయిన HDFC బ్యాంక్ సీనియర్ సిటీజెన్ల కోసం అమలు చేస్తున్న HDFC బ్యాంకు 'సీనియర్ సిటీజెన్ కేర్ ఎఫ్డీ' గడువును మే 10 వరకు పొడిగించింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్కీమ్ కింద.. సీనియర్ సిటీజెన్లకు రూ.0.75 శాతం అధిక వడ్డీ రేటును బ్యాంకు అందిస్తోంది. 5-10 సంవత్సరాల కాలపరిమితికి ఎఫ్డీపై ఇన్వెస్టర్లకు 7.75 శాతం వడ్డీ అందుతుంది. ఈ స్కీమ్ కింద.. సీనియర్ సిటిజన్లు రూ.5 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇదిలాఉండగా.. మే నెలలో ఆదివారాలు, రెండో, నాలుగో నాలుగు శనివారాలు, వివిధ పండుగలు, ఇతర సందర్భాల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజులు సెలవులు రానున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారనున్నాయి. Also Read: నోటా’ పై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు! #telugu-news #national-news #hdfc-bank #yes-bank #banks #icici-bank మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి