టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్ 10వ రోజుకు చేరుకుంది. మధ్యలో పలుసార్లు బెయిల్ కోసం పిటిషన్లు వేసినప్పటికీ న్యాయస్థానం అంగీకరించలేదు. ఇవాళ చంద్రబాబుకు సంబంధించిన 4 పిటిషన్లపై న్యాయస్థానాల్లో విచారణ జరనుంది. మరోవైపు ఎప్పటిలానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రోజువారి దినచర్య సాగుతోంది. ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి మెడిటేషన్ చేసిన చంద్రబాబు తర్వాత బ్లాక్ కాఫీ తీసుకున్నారు. వార్తాపత్రికలను చదివారు. ఇక
ఆయన కుటుంబసభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మిణి , బాలకృష్ణ సతీమణి వసుంధర, మనవడు దేవాన్ష్ రాజమండ్రిలోనే ఉన్నారు. ఇక నాలుగు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన లోకేశ్ కూడా ఇవాళ రాజమండ్రి చేరుకునే అవకాశం
మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు దాఖలు చేసిన క్వాట్ పిటిషన్ మీద ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. జ్యుడిషీయల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని చంద్రబాబు తరుఫు లాయర్లు పిటిషన్ వేశారు. దీనికి కౌంటర్ దాకలు చేసుకునేందుకు కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నిన్నటి వరకు టైమ్ ఙచ్చింది. ఆ గడువు పూర్తవడంతో నేడు క్వాట్ పిటిషన్ మీద హైకోర్టు విచారణ చేయనుంది. అలాగే ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్, సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ మీదన కూడా ఈరోజు విచారణ జరగనుంది. వీటిల్లో ఏ ఒక్కదానిలో అయినా కోర్టు బాబుకు అనుకూలంగా తీర్పు ఇస్తే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక చంద్రబాబు తనయుడు లోకేశ్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఈరోజు ఉదయం రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీ సమాధి దగ్గర టీడీపీ నేతలతో కలిసి నివాళులర్పించారు. తరువాత అక్కడే నల్లబాడ్జీలు ధరించి చంద్రబాబు అరెస్ట్ ను నిరశిస్తూ మౌనదీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ తో పాటూ టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఇంకా ముఖ్యనేతలు పాల్గొన్నారు.
చంద్రబాబు తరుఫున హేమాహేమీలు రంగంలోకి దిగుతున్నారు. తన మీద వేసిన కేసులను కొట్టేయాలంటూ హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. బాబు తరఫున ఈ కేసు వాదించడానికి హరీశ్ సాల్వే, సిద్దార్థ్ లూథ్రా, అగర్వాల్ సిద్ధం అయ్యారు. అటు ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గా, రంజిత కుమార్ తమ వాదనలు వినిపించనున్నారు. దీంతో హేమాహేమీలు రంగంలోకి దిగిన ఈ కేసులో విచారణ హాట్ హాట్గా జరిగేలా కనిపిస్తోంది.