Baltimore Bridge Accident : అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురు మృతి ! అమెరికాలోని బాల్డిమోర్‌లో రవాణా సరుకు ఓడ వంతెనను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలను కూడా బుధవారం ఉదయం వరకు నిలిపివేస్తున్నామని తెలిపారు. By B Aravind 27 Mar 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Baltimore Bridge Update : అమెరికా(America) లోని బాల్డిమోర్‌లో ఓ రవాణా సరుకు ఓడ(Transport Cargo Ship) వంతెనను ఢీకొనడంతో.. ఆ బ్రిడ్జి కూలిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే వారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలను కూడా బుధవారం ఉదయం వరకు నిలిపివేస్తు్న్నామని తెలిపారు. అయితే వీళ్లందరూ వంతెనపై గుంతలు పూడుస్తున్నారని మోరీలాండ్ రవాణాశాఖ కార్యదర్శి పాల్ వైడెఫెల్డ్ పర్కొన్నారు. వంతెన ప్రమాదం జరిగిన అనంతరం.. వాళ్లు కనిపించకుండా పోవడంతో దీన్ని బట్టి చూస్తే మరణించి ఉంటారని వారిని పనిలో నియమించుకున్న బ్రాన్ బిల్డర్స్ అనే కంపెనీ తెలిపింది. Also Read : సరిహద్దులను చెరిపేసిన ప్రేమ విడిపోయింది..బ్రేకప్ చెప్పుకున్న భారత్-పాక్ లెస్బియన్లు సెకండ్లలోనే కుప్పకూలిన వంతెన ఇదిలా ఉండగా.. పటాప్‌స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జిని సోమవారం అర్థరాత్రి దాటాక నౌక ఢీకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social Media) లో వైరలయ్యాయి. వీడియోలో.. నౌక వంతెనను ఢీకొనగానే కొన్ని సెకండ్లలనే అది కుప్పకూలడం, అలాగే వంతెన వెళ్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయిన దృశ్యాలు కనిపించాయి. వంతెనపై నుంచి పడిపోయిన వారిలో పలువరు గల్లంతయ్యారు. ఇప్పటివరకు ఇద్దరిని సహాయక సిబ్బంది రక్షించారు. వీళ్లలో ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. Closeup view of ship losing power twice before hitting the bridge. Note that clip is sped up. pic.twitter.com/SWY2qjkl0A — Brick Suit (@Brick_Suit) March 26, 2024 మధ్యాహ్నం జరిగి ఉంటే అలాగే వంతెనను ఢీకొన్న ఆ రవాణ సరకు నౌకలో కూడా మంటలు చెలరేగాయి. ఆ నౌకలో ఉన్న సిబ్బంది అంతా కూడా భారతీయులే(Indians). అయితే వాళ్లందరు క్షేమంగానే ఉన్నారు. ముందుగా నౌకలో కరెంట్ సరఫరా ఆగిపోయింది. దీంతో వెంటనే ప్రమాద జరిగిన సమాచారాన్ని సిబ్బంది అధికారులకు అందించారు. ఆ తర్వాత వెంటనే ఆ వంతనపైకి వెళ్లబోయే వాహనాలను ఆపేశారు. రాత్రి సమయంలో ఈ వంతెనపై చాలా తక్కువగా వాహనా సంచారం ఉండటం వల్ల ప్రాణనష్టం అంతగా జరగలేదు. ఒకవేళ మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే.. వందలాది వాహనాలు ఆ నదిలో పడిపోయేవి. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవించి ఉండేది. Also Read : యూట్యూబ్.. భారత్‌కు చెందిన వీడియోలు ఎన్ని తొలగించందంటే #baltimore-bridge-accident #america-news #bridge-accident #usa #telugu-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి