Joe Biden: వంతెన ప్రమాదం ఘటన.. భారత సిబ్బందిని ప్రశంసించిన బైడెన్
అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెన కూలిన ప్రమాదంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. నౌకలో ఉన్న భారత సిబ్బందిపై ప్రశంసలు కురించారు. సిబ్బంది అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపాడిందని అన్నారు. మళ్లీ ఆ వంతెనను నిర్మిస్తామని తెలిపారు.