Universities: మళ్లీ యూనివర్సిటీల బాట పడుతున్న 40 ఏళ్ల పైబడినవారు

కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు సింగపూర్‌లో 40 ఏళ్లు దాటినవారు మళ్లీ యూనివర్సిటీల బాట పడుతున్నారు. వీరికోసం అక్కడ పూర్తికాల డిప్లొమా కోర్సును కూడా రూపొందించింది సింగపూర్ ప్రభుత్వం. అంతేకాదు.. 40 ఏళ్లు దాటిన వారు ఈ కోర్సులు చేసేందుకు 90 శాతం ఫీజు రాయితీ కూడా ఇస్తోంది.

New Update
Universities: మళ్లీ యూనివర్సిటీల బాట పడుతున్న 40 ఏళ్ల పైబడినవారు

Universities: సాంకేతిర రంగం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అర్టిపిషియల్ ఇంటిలిజెన్స్(AI).. సాంకేతిక రంగంలో దూసుకుపోతోంది. ఇక భవిష్యత్తులో అంతా ఏఐ సాంకేతికతోనే ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పలు రంగాల్లో చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారని.. అలాగే కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయని అంటున్నారు. ఎవరైతే ఏఐ తగ్గట్టుగా స్కిల్స్‌ పెంపొందించుకుంటారో వారికే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

Also read: అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లో.. : మోదీ

అయితే సింగపూర్‌లో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ఆ దేశంలో 40 ఏళ్లు దాటినవారు మళ్లీ యూనివర్సిటీల బాట పడుతున్నారు. వీరికోసం అక్కడ పూర్తికాల డిప్లొమా కోర్సును కూడా రూపొందించింది సింగపూర్ ప్రభుత్వం. అంతేకాదు.. 40 ఏళ్లు దాటిన వారు ఈ కోర్సులు చేసేందుకు 90 శాతం ఫీజు రాయితీ కూడా ఇస్తోంది.

ప్రస్తుతం 40 ఏళ్లు దాటిన ఉద్యోగులు.. తాము 20 ఏళ్ల క్రితం చదువుకున్న చదువులకు, ఇప్పడున్న చదువులకు చాలా మార్పు ఉంటుందని ఆ దేశ పార్లమెంటు ఎంపీ టాన్‌ ఊ మెంగ్ పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన ఉద్యోగులు తమ జీవిత అనుభవాలను.. జీవన నైపుణ్యాలను తరగతి గదిలోకి తీసుకొస్తారు. యువ విద్యార్థులతో కలిసి వాళ్లు కొత్త స్కిల్స్ నేర్చుకుంటారని మెంగ్ తెలిపారు.

Also Read: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అవిభక్త కవలలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు