HI Court Notice : బాలీవుడ్ స్టార్ హీరోలు షారూక్ ఖాన్(Shah Rukh Khan), అక్షయ్ కుమార్(Akshay Kumar), అజయ్ దేవగణ్(Ajay Devgn) లకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బాలీవుడ్ నటులకు కోర్టు నోటీసులు ఎందుకు ఇచ్చింది అంటే..గుట్కా కంపెనీల ప్రకటనలపై వీరి ముగ్గురికి కోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. గుట్కా ప్రకటనలకు సంబంధించిన కేసును సుప్రీం కోర్టు కూడా విచారిస్తున్న సంగతి తెలిసిందే.
గుట్కా కంపెనీలకు సంబంధించిన ప్రకటనలలో నటిస్తున్న వాటిని ప్రమోట్ చేస్తున్న నటీనటులతో పాటు పలువురు ప్రముఖుల పై కూడా చర్యలు తీసుకోవాలని చాలా కాలం కిందటే కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇలా కోర్టులో పిటిషన్లు రావడంతో కొందరు నటీనటులు గుట్కా కంపెనీలకు చెందిన ప్రకటనల్లో నటించడంతో పాటు వాటిని ప్రమోట్ చేసే విషయంలో కూడా వెనక్కి తగ్గారు.
కానీ కొందరు మాత్రం మాకు ఏమి సంబంధం లేదు. మాకు డబ్బులు వస్తే చాలు అన్నట్లుగా ఈ విషయం గురించి స్పందించలేదు. అయితే ఈ విషయం గురించి వెంటనే చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు. దీంతో ఈ విషయం గురించి వెంటనే చర్యలు తీసుకోవాలని జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్ తో కూడిన ధర్మాసనం చాలా కాలం కిందటే కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ విషయం గురించి అక్టోబర్ 22 వ తేదీని గవర్నమెంట్ కి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ వాదనలు వినిపిస్తున్నారు. దాంతో అక్షయ్ కుమార్, షారూక్ ఖాన్, అజయ్ దేవగణ్ లకు కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసిందని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే శుక్రవారం హైకోర్టుకు తెలిపారు.
ఇలా పిటిషన్ దాఖలు అయ్యింది అన్న విషయం తెలుసుకున్న బిగ్ బి అమితాబ్ గుట్కా ప్రకటనల నుంచి వెనక్కి తగ్గారు. గతంలో ఆయన ఓ పాన్ మసాలా యాడ్ లో నటించారు. దాని గురించి విమర్శలు రావడంతో ఆయన కంపెనీలతో తాను కుదుర్చుకున్న అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు.
అయితే ఇలా అమితాబ్ తో ఒప్పందం రద్దు అయినా.. ఇంకా అమితాబచ్చన్ కు సంబంధించిన ప్రకటనను ప్రదర్శిస్తున్నారనే కంప్లైయింట్ కోర్టుకు వెళ్ళింది.
Also read: మా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం జర్నలిజం ఎలా అవుతుంది!