నాసాలో ఉద్యోగం సాధించిన తెలుగు యువకుడు
పేద కుటుంబంలో పుట్టినా ఇంట్లో పరిస్థితులు సహకరించకున్నా విదేశాల్లోని గొప్ప కంపెనీల్లో ఉద్యోగం సాధించిన విద్యార్థుల జీవితం అందరికీ స్ఫూర్తినిస్థాయి. గుంటూరు జిల్లాకు చెందిన యువకుడి విజయ గాధను ఇప్పుడు చూద్ధాం
పేద కుటుంబంలో పుట్టినా ఇంట్లో పరిస్థితులు సహకరించకున్నా విదేశాల్లోని గొప్ప కంపెనీల్లో ఉద్యోగం సాధించిన విద్యార్థుల జీవితం అందరికీ స్ఫూర్తినిస్థాయి. గుంటూరు జిల్లాకు చెందిన యువకుడి విజయ గాధను ఇప్పుడు చూద్ధాం
మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ పై థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఘాటుగా సెటైర్లు వేశారు. అసలు అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదన్నారు. అయితే పృథ్వీ గతంలో వైసీపీలో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఎవరో తెలీదని చెప్పడం గమనార్హం. దీంతో పృథ్వీ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
గతకొంతకాలంగా ఆస్ట్రేలియా ఒడ్డుకు కొట్టుకొచ్చిన అంతుచిక్కని వస్తువు ఎక్కడినుంచి వచ్చిందనే మ్యాటర్ అప్పట్లో మిస్టరీగా మారింది. ఇవాల్టితో దాని మిస్టరీని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చేధించారు. ఈ వస్తువు భారత్‌కు చెందిన రాకెట్‌దేనని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ (ASA) అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు ఉత్తరాన రెండు గంటల ప్రయాణంలో ఉన్న జురియన్ బే సమీపంలో జూలై వారంలో ఈ వస్తువు తొలిసారిగా కనిపించింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. కేసీఆర్ ఫాంహౌజ్ లో కూర్చొని నీరోచక్రవర్తిలాగా వ్యవహరించవద్దని ఆయన ఫైర్ అయ్యారు. సమీక్ష చేస్తున్నామని మభ్యపెట్టొద్దని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతంలో బాధితులు కట్టు బట్టలతో మిగిలిపోయారన్నారు. ఇళ్లలో సామాను కొట్టుకుపోయిన వారికి ఒక్కో ఇంటికి 25 వేల రూపాయలు ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని.. వెంటనే సర్వే చేయించాలని ఈటల డిమాండ్ చేశారు.
పద్దెనిమిదేళ్ల క్రితం రిలీజైన థియేట్రికల్ మూవీ చంద్రముఖి లకలకలక గుర్తుందిగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఈ మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో తిరుగులేని మార్కెట్‌ను తెచ్చిపెట్టింది.అప్పట్లో మన స్టార్ హీరోలే పాతిక కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టడానికి నానా తంటాలు పడుతుంటే సూపర్‌స్టార్ మాత్రం సింగిల్‌హ్యాండ్‌తో పాతిక కోట్ల మార్క్‌ను టచ్ చేసిబాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశాడు.అంతలా ఈ మూవీ సంచలనాలను క్రియేట్ చేసింది. అయితే అదే సీక్వెల్లో వస్తున్న మూవీపై ఫ్యాన్స్ గుర్రుమీదున్నారు. సోషల్‌మీడియా వేదికగా తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు షాక్ తగిలింది. ఆయన సొంత పార్టీ నాయకులే ఆయనకు వ్యతిరేకంగా తయారయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం పార్టీ కార్యకర్తలు, నాయకులు సోమవారం నిజామాబాద్ పార్టీ కార్యలయం ముందు ఆందోళన చేపట్టారు
విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. వెస్టీండీస్ తో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో నెగ్గి 1-0 తో ముందంజలో ఉన్న టీమ్ ఇండియా శనివారం జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే
వెస్టిండీస్ తో రెండో వన్డేలో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ... భారత్ యువ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ ఒక ప్రపంచ రికార్డును సాధించాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ పేరిట ఉన్న వన్డే రికార్డును ఇండియన్ బ్యాటర్ శుభమన్ గిల్ బ్రేక్ చేశాడు.
మహారాష్ట్ర రాజకీయాలు గత కొంత కాలం నుంచి వార్తల్లో నిలుస్తున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన తరువాత నుంచి కూడా ఒక వర్గం మీద మరొక వర్గం నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని టార్గెట్ చేసుకొని మరి కొన్ని రోజుల నుంచి ఏక్ నాథ్ వర్గం విమర్శలు గుప్పిస్తుంది.