చంద్రముఖి 2 ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్..ఫ్యాన్స్ ఏమంటున్నారంటే.. పద్దెనిమిదేళ్ల క్రితం రిలీజైన థియేట్రికల్ మూవీ చంద్రముఖి లకలకలక గుర్తుందిగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఈ మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో తిరుగులేని మార్కెట్‌ను తెచ్చిపెట్టింది.అప్పట్లో మన స్టార్ హీరోలే పాతిక కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టడానికి నానా తంటాలు పడుతుంటే సూపర్‌స్టార్ మాత్రం సింగిల్‌హ్యాండ్‌తో పాతిక కోట్ల మార్క్‌ను టచ్ చేసిబాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశాడు.అంతలా ఈ మూవీ సంచలనాలను క్రియేట్ చేసింది. అయితే అదే సీక్వెల్లో వస్తున్న మూవీపై ఫ్యాన్స్ గుర్రుమీదున్నారు. సోషల్‌మీడియా వేదికగా తెగ ట్రోల్స్ చేస్తున్నారు. By Shareef Pasha 31 Jul 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి హర్రర్ మూవీ చంద్రముఖి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన రికార్డులు బ్రేక్ చేశాయి. వాస్ మేకింగ్, విజన్‌తో హర్రర్ సినిమాలకు ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేశాడు. కాగా మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. రాఘవ లారెన్స్‌ను హీరోగా పెట్టి పి.వాసు ఈ సినిమా సీక్వెల్‌ను రూపొందించాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటుంది.అయితే ఇదిలా ఉంటే మన దర్శక నిర్మాతలు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అస్సలు అర్ధం కావడం లేదు. ఎందుకంటే టాలీవుడ్, బాలీవుడ్ దర్శకనిర్మాతల మీద ఫ్యాన్స్ ఘరం అవుతూ తిట్లపురాణం షురూ చేశారు. మొన్న డార్లింగ్ ప్రభాస్ 'కల్కి 2898 AD'సినిమా విషయంలోనూ,తాజాగా హీరో లారెన్స్ 'చంద్రముఖి-2' మూవీపైనా అలాంటి విమర్శలే వెల్లువెత్తాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఫ్యాన్స్‌కి బాగా కనెక్ట్ అయిన మూవీ ఇదే Thanks to Thalaivar Superstar @rajinikanth! Here’s presenting you the first look of #Vettaiyan 👑 I need all your blessings! Releasing this GANESH CHATURTHI in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! 🔥 #Chandramukhi2 🗝 pic.twitter.com/v4qYmkzeDh— Raghava Lawrence (@offl_Lawrence) July 31, 2023 సూపర్‌స్టార్ రజినీకాంత్ 'చంద్రముఖి' గురించి టాలీవుడ్ ఆడియెన్స్‌కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 90's జనరేషన్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యిందనే చెప్పాలి. ఈ మూవీకి దాదాపు 18 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీస్తున్నారు. ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. చంద్రముఖిగా కంగనా రనౌత్ భయపెట్టనుంది. ఈ క్రమంలోనే సోమవారం ఫస్ట్ లుక్ రిలీజ్‌ని మూవీ యూనిట్ రిలీజ్ చేశారు. అయితే ప్రశంసలకు బదులుగా ట్రోల్స్ వచ్చి పడుతున్నాయి. ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరిచిన పోస్టర్ Back with double the swag and attitude! 😉 Witness Vettaiyan Raja's 👑 intimidating presence in @offl_Lawrence 's powerful first look from Chandramukhi-2 🗝️Releasing this GANESH CHATURTHI in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! 🤗#Chandramukhi2 🗝️🎬 #PVasu🌟… pic.twitter.com/nf7BHwi3x6— Lyca Productions (@LycaProductions) July 31, 2023 ఈ ఫస్ట్ లుక్‌లో లారెన్స్ వెంకటపతి రాజు గెటప్‌లో కనిపించాడు. కాకపోతే తల పెద్దగా, శరీరం చిన్నగా, చేయి సన్నగా ఉండటం వింతగా అనిపించింది.దీన్ని చూసిన నెటిజన్స్.. తెలిసే ఈ తప్పు జరిగిందా? లేదంటే కావాలనే ఇలా చేస్తున్నారా? అంటూ మండిపడుతున్నారు. మొన్నీ మధ్య ప్రభాస్ 'కల్కి' ఫస్ట్ లుక్ విషయంలో ఇలానే జరగ్గా, వెంటనే దాన్ని మార్చి మరో లుక్‌ని రిలీజ్ చేశారు.'చంద్రముఖి 2' లుక్ ఏమైనా మార్చి రిలీజ్ చేస్తారా? అలానే వదిలేస్తారా అనేది వేచి చూడాలి. వినాయక చవితికి ఈ మూవీని థియేటర్లలో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు సన్నద్ధం అయ్యారు చిత్రం యూనిట్.పోస్టర్ విషయంలోనే ఫ్యాన్స్‌ని నిరాశపరిచింది. మరి మూవీ విషయంలో ఫ్యాన్స్‌ని అలరిస్తుందో లేదో చూడాలి. #hero-raghava-lawrence #movies #tollywood-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి