నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు షాక్ తగిలింది. ఆయన సొంత పార్టీ నాయకులే ఆయనకు వ్యతిరేకంగా తయారయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం పార్టీ కార్యకర్తలు, నాయకులు సోమవారం నిజామాబాద్ పార్టీ కార్యలయం ముందు ఆందోళన చేపట్టారు. కొద్ది రోజుల క్రితమే అర్వింద్ 13 మండలాల బీజేపీ అధ్యక్షులను మార్పు చేస్తున్నట్లు అర్వింద్ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మూడు నియోజవర్గాలకు చెందిన కార్యకర్తలు కార్యాలయం ముందు బైఠాయించారు. సొంత నియోజకవర్గ కార్యకర్తలే ఇలా నిరసనకు దిగడంతో జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు జరగడం అటు పార్టీ పెద్దలను కూడా కలవరపెడుతున్నాయి.
సొంత పార్టీ నేతలే తిరుగబడటం చర్చనీయాంశంగా మారింది. పార్టీని ఎప్పటి నుంచో అట్టిపెట్టుకొని ఉన్న నేతలను పక్కన పెట్టేసి కొత్త వారికి అవకాశం ఇవ్వడం పై పార్టీ లో మొదటి నుంచి కూడా అసంతృప్తి అనేది ఉంది.నమ్మకమైన నేతలకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'సేవ్ బీజేపీ ఇన్ నిజామాబాద్, జై అరవింద్ అన్నవాళ్లకే పదవులా..? జై బీజేపీ అన్నవాళ్లపై వేటు.. భారత్ మాతాకి జై.. భారతీయ జనతా పార్టీ జిందాబాద్.. వి వాంట్ జస్టిస్.. ఎంపీ అర్వింద్ ఒంటెడ్డు పొకడలు నశించాలి' అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి వ్యతిరేకత రావడం అర్వింద్‌కు తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఈ వివాదం ఎక్కడివరకు దారి తీస్తుంది..? అనేది చూడాలి.