జూలై 15న పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్‌లోని బీచ్ (Australia Green Beach) సమీపంలో ఈ వస్తువు కనిపించింది. ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకి (ISRO) చెందిన రాకెట్‌లోని పార్ట్ అయి ఉంటుందని కొందరు భావించారు. అంతేకాదు ఇది ఖచ్చితంగా చంద్రయాన్-3కి చెందిన శకలం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. మరోవైపు ఇంకొందరు తొమ్మిదేళ్ల కిందట అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ MH-370 విమానందేమో అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ దానిని అధ్యయనం చేసి సోమవారం (31-07-2023) రోజున ఒక ప్రకటన చేసింది.
PSLVకి చెందిన శకలమని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ స్పష్టీకరణ
Last friday, people in Australia reported seeing a comet/UFO in the sky which turned out to be the LVM3 rocket that launched #Chandrayaan3.
— Debapratim (@debapratim_) July 17, 2023
And now, the third stage of a PSLV rocket has washed ashore on the coast of Green Head, Western Australia! #ISRO pic.twitter.com/FFVwhooSyE
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంఛ్ వెహికిల్ (PSLV)కి చెందిన శకలమని అధికారులు ప్రకటించారు. అయితే అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలోకి లోబడి ఇరు దేశాలు సంయుక్త ప్రకటన వెలువరించాల్సి ఉందని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. అయితే తాము పరిశీలించిన తర్వాతే ప్రకటన చేస్తామని ఇస్రో ఇదివరకే ప్రకటించగా ఇక అది ఎప్పటిది అనే దానిపై ఇస్రో అధికారులే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
గతంలోనూ ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకొచ్చిన శకలాలు
PSLV ప్రయోగ దశల్లో ఇలా శలాలను సముద్రంలో పడేయడం సాధారణంగా జరిగేదే. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా తీరానికి ఇలాంటి స్పేస్ జంక్ కొట్టుకురావడం ఇదేం తొలిసారి కాదు. గత ఆగష్టులోనూ ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ రాకెట్ శకలం న్యూసౌత్‌వేల్స్‌లోని ఓ గడ్డి మైదనాంలో పడగా ఓ గొర్రెల కాపరి దానిని గుర్తించి అధికారులకు సమాచారం అందించాడు.