Jaggareddy: నేను రేవంత్‌కు భజన చేసే బ్యాచ్ కాదు.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

హరీష్ రావు డబ్బులు పంచడం వల్లే సంగారెడ్డిలో ఓడిపోయినట్లు జగ్గారెడ్డి తెలిపారు. మెదక్ ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలని రేవంత్‌ను కోరినట్లు తెలిపారు. అలాగే.. బీఆర్ఎస్ నుంచి 20మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగాలని రేవంత్‌కు సలహా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Jaggareddy: నేను రేవంత్‌కు భజన చేసే బ్యాచ్ కాదు.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
New Update

EX MLA Jaggareddy: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) అభ్యర్థిగా బరిలోకి దిగిన జగ్గారెడ్డి.. తన ఓటమికి గల కారణాలను ఆర్టీవీతో (RTV Exclusive Interview) పంచుకున్నారు. తన తదుపరి కార్యాచరణపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారా? లేదా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారా? అనే దానిపై ఆయన ఆర్టీవీకి క్లారిటీ ఇచ్చారు.

ALSO READ: గుడ్ న్యూస్.. రూ.29లకే కిలో బియ్యం.. కేంద్రం కీలక ప్రకటన

రెండు కారణాలు..

సంగారెడ్డిలో (Sangareddy) తన ఓటమికి రెండు కారణాలు అని అన్నారు జగ్గారెడ్డి. హరీష్‌ రావు (Harish Rao) పంచిన డబ్బు ఒక కారణం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజలకు అందుబాటులో ఉండననేది మరో ప్రచారం జరిగిందని అన్నారు. ఓడిపోయినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి ఫైటర్‌, తనకు మంత్రి కావాలని ఉండదు అని మంత్రి పదవిపై క్లారిటీ ఇచ్చారు.

20 మంది ఎమ్మెల్యేలను..

తాను సీఎం రేవంత్‌ రెడ్డికి (CM Revanth Reddy) ఓ సలహా ఇచ్చానని.. బీఆర్‌ఎస్‌ నుంచి 20 మంది ఎమ్మెల్యేలని లేపాలని చెప్పినట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఆ అవకాశం బీఆర్‌ఎస్‌ నేతలు తమకు ఇస్తున్నారని అన్నారు. 20 మందిని లాగేద్దామని రేవంత్‌కి చెప్పాను అని అన్నారు. తన ముందు హరీష్‌ పిల్లోడు అని పేర్కొన్నారు. దమ్ముంటే హరీష్‌ తన ముందుకు రావాలని సవాల్ విసిరారు.

పోలీసులు బీఆర్ఎస్‌కు పనిచేశారు..

మొన్న ఎన్నికల్లో సంగారెడ్డిలో పోలీసులు బీఆర్ఎస్‌కు అనుకూలంగా ప్రవర్తించారని ఆరోపించారు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి ఒక్కసారి అనుకుంటే అందర్నీ అడ్డుకునే వాడే అని అన్నారు. బీఆర్ఎస్ వాళ్లు పంచే డబ్బులు ని అడ్డుకోవద్దని ప్రజలు కోరుకున్నారని పేర్కొన్నారు. లేదంటే SP, CI, SI లను గల్లా పట్టికొట్టేవాడినాని అన్నారు.

మెదక్ ఎంపీగా..

మెదక్ ఎంపీ సీటును తనకు ఇవ్వాలని.. రేవంత్ రెడ్డికి మెదక్ నుంచి పోటీ చేస్తా అని చెప్పినట్లు తెలిపారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌ను అడ్డుకునే దమ్మున్న నాయకుడిని తానే అని అన్నారు. రేవంత్ నేను ఇంకా చాలామంది తెలంగాణ పీసీసీ చీఫ్ కోసం పోటీ పడ్డాం అది అంతవరకే అని.. రేవంత్ రెడ్డి ఇంట్లో నేను రేవంత్ ని కలిసింది దానికి కారణాలు చాలా ఉన్నాయి కొన్ని మీడియా ముందు చెప్పలేను అని అన్నారు.

రేవంత్ ను పొగిడే బ్యాచ్ నేను కాదు..

రేవంత్ ను పొగిడే బ్యాచ్ నేను కాదు ..జగ్గారెడ్డి అంటే డిఫరెంట్ అని అన్నారు. తన కూతురు పోటీకి దూరం అని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే తన కూతురు పెళ్లి చేయబోతున్నట్లు తెలిపారు. పది సంవత్సరాల తర్వాత తన కూతురు రాజకీయాల్లోకి వస్తుందని పేర్కొన్నారు. దేవుడితో రాజకీయం చేసే పార్టీ కాంగ్రెస్ కాదు అని అన్నారు. రాహుల్ గాంధీ పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టాడని వ్యాఖ్యానించారు. బీజేపీ దేవుడి పేరుతో రాజకీయం చేయాలనుకుంటుందని ఆరోపించారు.

 

#cm-revanth-reddy #sangareddy #congress-party #harish-rao #jagga-reddy #mp-elections-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe